#90s Web Series : పాన్ ఇండియా లెవెల్‌లో.. 90s వెబ్ సిరీస్ స్ట్రీమింగ్.. ప్రమోషన్స్‌లో మౌళి..
పాన్ ఇండియా లెవెల్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 90s వెబ్ సిరీస్. ఢిల్లీ వీధుల్లో మౌళి ప్రమోషన్స్..

Mouli pan India promotions of Sivaji 90s A Middle Class Biopic web series
#90s Web Series : ఇటీవల తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఈటీవీ విన్ లో రిలీజైన ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో మౌళి తనూజ్ ప్రశాంత్, వాసంతిక, రోహన్ రాయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్స్ తో తెలుగులో మాత్రమే విడుదలైంది. ఇక తెలుగులో సూపర్ హిట్టైన ఈ సిరీస్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
దీంతో తెలుగులో ఈ సిరీస్ ప్రమోషన్స్ అన్నిటిని తన బుజం మీద వేసుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ ప్రమోట్ చేసే భాద్యత కూడా తానే తీసుకున్నాడు. ఢిల్లీ వీధుల్లో ఈ సిరీస్ ని ప్రమోట్ చేస్తూ మౌళి ఓ వీడియో చేశారు. ఇక ఆ వీడియోని తన ఇన్‌స్టా షేర్ చేశాడు. మరి తెలుగులో అందరి మనసు దోచుకొని సూపర్ హిట్టుగా నిలిచిన.. ఈ సిరీస్ ఇతర భాషల్లో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.
Also read : Poonam Kaur : ఆ ప్రెస్టీజియస్ అవార్డు సోనూసూద్‌కి కూడా ఇవ్వాల్సింది.. పూనమ్ కౌర్
View this post on Instagram
కాగా ఈ సిరీస్ కి కొనసాగింపు ఉంటుందని సిరీస్ ఎండింగ్ లోనే తెలియజేసిన సంగతి తెలిసిందే. తెలుగు ఆడియన్స్ అంతా ఇప్పుడు ఆ సెకండ్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సెకండ్ సీజన్ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందో కూడా దర్శకుడు ఆదిత్య హాసన్.. ఇటీవల సక్సెస్ మీట్ లో తెలియజేశారు. ఇంటర్ కాలేజీ డేస్ అండ్ హాస్టల్ లైఫ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సెకండ్ సీజన్ ఉండబోతుందట.
రెండేళ్లు ఇంటర్ లో ఒకరి గురించి ఒకరు తెలుసుకునేలోపే ఇంజనీరింగ్ లైఫ్ మొదలైపోతుంది. ఇక ఇంటర్ చదవడం కోసం ఎక్కడో పల్లెటూరు నుంచి టౌన్ కి వచ్చి హాస్టల్ లో ఉండడం. హోమ్ ఫ్రీడమ్‌కి, పల్లెటూరి లైఫ్‌కి.. హాస్టల్ అండ్ టౌన్ లైఫ్‌కి కల్చర్ చేంజ్ చూసి చాలా మంది భయపడతారు, తికమకపడతారు. కాలేజీలో అల్లరి చేస్తూ బయటకి పొగరుగా కనిపించిన స్టూడెంట్ కూడా నైట్ పడుకునే ముందు ఇంటి లైఫ్ గుర్తుకు వచ్చి ఇంటర్ రెండేళ్ల కచ్చితంగా ఏడుస్తారు. అలాంటి సన్నివేశాలు అన్నిటిని ఈ సెకండ్ సీజన్ లో చూపించబోతున్నారు.