Mrunal Thakur: సీతా రామం దెబ్బకు బాగా పెంచేసిన మృణాల్!
టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సీతా రామం’ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో సీత పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్‌తో ఆమెకు ఫుల్ మార్కులు పడ్డాయి. సీతా రామం సక్సెస్‌ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ. తన రెమ్యునరేషన్‌ను ఏకంగా కోటి రూపాయలు చేసేసిందట ఈ అమ్మడు.

Mrunal Thakur Hikes Remuneration After Sita Ramam Success
Mrunal Thakur: టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సీతా రామం’ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించగా, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో సీత పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్‌తో ఆమెకు ఫుల్ మార్కులు పడ్డాయి.
Sita Ramam: బాలీవుడ్ భరతం పట్టేందుకు రెడీ అయిన సీతా రామం!
అయితే ఈ సినిమాలో అమ్మడి అందచందాలతో పాటు అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించిన లుక్స్, ఆమె హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అటు పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ బ్యూటీ అదరగొట్టడంతో మృణాల్‌కు మంచి పేరు వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో ఇప్పుడు మృణాల్ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది.
Mrunal Thakur : చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న మృణాల్ ఠాకూర్
అమ్మడికి ఆల్రెడీ మరో రెండు ప్రాజెక్టుల్లో ఆఫర్ లభించినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి వైజయంతి మూవీస్ బ్యానర్ నుండే కావడం విశేషం. సీతా రామం తరువాత మరోసారి వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నటించే ఛాన్స్ రావడంతో, మృణాల్ తన రెమ్యునరేషన్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోందట. సీతా రామం సక్సెస్‌ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ. తన రెమ్యునరేషన్‌ను ఏకంగా కోటి రూపాయలు చేసేసిందట ఈ అమ్మడు. అయితే సీతా రామం చిత్రంలో అందానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడంతో అమ్మడు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారు.