Sita Ramam: బాలీవుడ్ భరతం పట్టేందుకు రెడీ అయిన సీతా రామం!

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సీతా రామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా క్లాసిక్ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. కాగా ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Sita Ramam: బాలీవుడ్ భరతం పట్టేందుకు రెడీ అయిన సీతా రామం!

Sita Ramam To Set Bollywood On Fire

Sita Ramam: టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సీతా రామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా క్లాసిక్ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక ఈ సినిమాను క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ప్రేక్షకులను ఈ మూవీ అలరించడంలో సక్సెస్ అయ్యింది.

Sita Ramam Collections: కలెక్షన్లతో దూసుకుపోతున్న సీతా రామం!

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌ల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కాగా, ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేయడంలో సక్సెస్ కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా రూ.65 కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది. కాగా ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా హిందీ వర్షన్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ సొంతం చేసుకుంది.

Sita Ramam : చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూశాను.. సీతారామం సినిమాపై వెంకయ్యనాయుడు రివ్యూ..

దక్షిణాదిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ కావడంతో, ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 2న హిందీ డబ్బింగ్‌లో రిలీజ్ చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి సౌత్ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకున్న ‘సీతా రామం’ ఉత్తరాది ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాను వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.