Sita Ramam Collections: కలెక్షన్లతో దూసుకుపోతున్న సీతా రామం!

టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సీతా రామం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటినా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు ఇంకా వస్తుండటం విశేషం. కలెక్షన్ల పరంగా కూడా సీతా రామం అన్‍స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సినిమా రెండు వారాలు దాటినా, ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తుండటంతో ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

Sita Ramam Collections: కలెక్షన్లతో దూసుకుపోతున్న సీతా రామం!

Sita Ramam Collections Unstoppable

Sita Ramam Collections: టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సీతా రామం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటినా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు ఇంకా వస్తుండటం విశేషం. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా, అందాల భామ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించిన సీతా రామం ప్యూర్ రొమాంటిక్ కథతో రాగా, ప్రేక్షకులు ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు.

Sita Ramam : చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూశాను.. సీతారామం సినిమాపై వెంకయ్యనాయుడు రివ్యూ..

దీంతో ఈ సినిమా రిలీజ్ రోజునే బ్రహ్మాండమైన టాక్‌ను అందుకుంది. ఇక ఈ సినిమా రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ వెళ్లింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా సీతా రామం నిలిచింది. హను రాఘవపూడి సత్తా ఏమిటో ఈ సినిమాతో ప్రేక్షకులకు చూపించాడు. అటు కలెక్షన్ల పరంగా కూడా సీతా రామం అన్‍స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సినిమా రెండు వారాలు దాటినా, ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తుండటంతో ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

Sita Ramam: సీతా రామం ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. తగ్గేదే లే!

దుల్కర్ సల్మాన్, మృణాల్‌ల ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌కు హను రాఘవపూడి అల్టిమేట్ టేకింగ్ తోడవ్వడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. ఇక మూడో వారంలోకి అడుగుపెట్టిన సీతా రామం కృష్ణాష్టమి రోజున కూడా కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వీకెండ్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు మాత్రమే హల్‌చల్ చేస్తుండటంతో సీతా రామం కలెక్షన్లు కూడా పెరగడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.