Sita Ramam: సీతా రామం ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. తగ్గేదే లే!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సీతా రామం’ గతవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Sita Ramam: సీతా రామం ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. తగ్గేదే లే!

Sita Ramam First Week Collections

Sita Ramam: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సీతా రామం’ గతవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతున్నా, ప్రేక్షకులు ఇంకా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది.

Sita Ramam: మిలియన్ డాలర్ మూవీగా వెళుతున్న సీతా రామం!

ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తికాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.19.18 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. గ్రాస్ పరంగా ఈ సినిమా రూ.37.80 కోట్లు కలెక్ట్ చేసి తన సత్తా చాటింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయగా, ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన ఓ స్పెషల్ రోల్ లో నటించింది.

Sita Ramam: అక్కడ రిలీజ్‌కు రెడీ అయిన సీతా రామం!

ఇక మున్ముందు ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మరింత వేగం పుంజుకోనుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఏరియాల వారీగీ ఈ చిత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.28 కోట్లు
సీడెడ్ – 1.23 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.67 కోట్లు
ఈస్ట్ – 1.01 కోట్లు
వెస్ట్ – 0.66 కోట్లు
గుంటూరు – 0.77 కోట్లు
కృష్ణా – 0.89 కోట్లు
నెల్లూరు – 0.42 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.10.93 కోట్లు (రూ.20 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 1.15 కోట్లు
ఇతర భాషలు – 3 కోట్లు
ఓవర్సీస్ – 4.10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.19.18 కోట్లు (రూ.37.80 కోట్ల గ్రాస్)