Sita Ramam: అక్కడ రిలీజ్‌కు రెడీ అయిన సీతా రామం!

గత శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతా రామం’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. సీతా రామం చిత్రంలో కొన్ని మతపరమైన అంశాలు అభ్యంతకరంగా ఉండటంతో ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ కాకుండా బ్యాన్ చేశారు.

Sita Ramam: అక్కడ రిలీజ్‌కు రెడీ అయిన సీతా రామం!

Sita Ramam: గత శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతా రామం’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ‘సీతా రామం’ ప్యూర్ రొమాంటిక్ మూవీగా రాగా, ‘బింబిసార’ ఫాంటెసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు చిత్ర యూనిట్. అయితే దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Sita Ramam: ‘సీతా రామం’కు నో చెప్పిన స్టార్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

కాగా, ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నించింది. కానీ, ఈ సినిమాను యూఏఈ దేశాల్లో రిలీజ్ చేయకుండా అక్కడి సెన్సాన్ బోర్డు ఈ సినిమాను బ్యాన్ చేసింది. సీతా రామం చిత్రంలో కొన్ని మతపరమైన అంశాలు అభ్యంతకరంగా ఉండటంతో ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ కాకుండా బ్యాన్ చేశారు. దీంతో ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ కాకుండానే మిగతా ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా గల్ఫ్ దేశాల్లో కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Sita Ramam: అమెరికాలో అదరగొడుతున్న సీతా రామం!

యూఏఈ సెన్సార్ బోర్డు తాజాగా సీతా రామం చిత్ర రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని మార్పులతో ఈ సినిమాకు యూఏఈ సెన్సార్ సర్టిఫికెట్‌ను పొందింది సీతా రామం. ఈ శుక్రవారం గల్ఫ్ దేశాల్లో సీతా రామం చిత్రం విడుదల అవుతుందనే వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. గల్ఫ్ దేశాల్లో దుల్కర్ సల్మాన్‌కు ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా అక్కడ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.