Sita Ramam: మిలియన్ డాలర్ మూవీగా వెళుతున్న సీతా రామం!

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సీతా రామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడేస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ కాగా, తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Sita Ramam: మిలియన్ డాలర్ మూవీగా వెళుతున్న సీతా రామం!

Sita Ramam: టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సీతా రామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడేస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ కాగా, తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

Sita Ramam Hindi Version: మళ్లీ రిలీజ్ అవుతున్న సీతా రామం.. ఎక్కడంటే?

ఇక మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠూకూర్ జంటగా నటించిన ఈ సినిమా కథ, చాలా కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తూ నిర్మాతలకు కాసుల పంటను పండిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది.

Sita Ramam: అక్కడ రిలీజ్‌కు రెడీ అయిన సీతా రామం!

ముఖ్యంగా ఒక్క యూఎస్‌లోనే ఈ సినిమా ఇప్పటికే 750K డాలర్ల మార్క్‌ను దాటేసింది. త్వరలోనే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. మరి ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.