Sita Ramam Hindi Version: మళ్లీ రిలీజ్ అవుతున్న సీతా రామం.. ఎక్కడంటే?

టాలీవుడ్‌లో రిలీజ్ అయిన ‘సీతా రామం’ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా, ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ జనం కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు హిందీ వర్షన్‌లో రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Sita Ramam Hindi Version: మళ్లీ రిలీజ్ అవుతున్న సీతా రామం.. ఎక్కడంటే?

Sita Ramam Hindi Version: టాలీవుడ్‌లో రిలీజ్ అయిన ‘సీతా రామం’ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా, ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకోవడంతో, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.

Sita Ramam: అక్కడ రిలీజ్‌కు రెడీ అయిన సీతా రామం!

కాగా, ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేయగా, ఇటీవల ఈ సినిమా UAE సెన్సార్ నుండి రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ అందుకుంది. దీంతో ఈ సినిమా ఆగస్టు 11న గల్ఫ్ దేశాల్లో మంచి అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా గురించి తెలుసుకున్న బాలీవుడ్ జనం కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు హిందీ వర్షన్‌లో రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే నార్త ఆడియెన్స్‌కు ఓ తీయటి వార్తను తెలియజేసింది ఈ చిత్ర యూనిట్.

Sita Ramam: ‘సీతా రామం’కు నో చెప్పిన స్టార్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

సీతా రామం హిందీ వర్షన్ చిత్రాన్ని ఆగస్టు 19న నార్త్ బెల్ట్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా హిందీ వర్షన్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ రిలీజ్ చేయనుండటంతో అక్కడ కూడా ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మరి ‘సీతా రామం’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నార్త్ ఆడియెన్స్ ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో తెలియాలంటే ఆగస్టు 19 వరకు వెయిట్ చేయాల్సిందే.