Shilpa Shetty : ఆరు గంటలపాటు శిల్పాను విచారించిన పోలీసులు.. మరదలితో కొత్త యాప్..?

వియాన్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న శిల్పా ఉన్నట్టుండి గతేడాది ఆ బాధ్యతల నుండి తప్పుకోవడానికి గల కారణాలేంటి?..

Shilpa Shetty : ఆరు గంటలపాటు శిల్పాను విచారించిన పోలీసులు.. మరదలితో కొత్త యాప్..?

Shilpa Shetty

Updated On : July 24, 2021 / 12:29 PM IST

Shilpa Shetty: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ గుట్టు రట్టవడంతో చాలా మంది సెలబ్రిటీల పేర్లు బయటకి వస్తున్నాయి. రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ కంపెనీ డైరెక్టర్లలో శిల్పా శెట్టి ఒకరిగా ఉన్నారు. ఇటీవలే ఈ కంపెనీ కార్యాలయంపై దాడులు జరిపి భారీగా పోర్న్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శిల్పా శెట్టిని అరెస్ట్ చేసే అవకాశముందని వార్తలు వచ్చాయి.

Raj Kundra : భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్పందించిన శిల్పా శెట్టి.. రిమాండ్ పొడిగించిన పోలీసులు..

అయితే పోలీసులు శిల్పా శెట్టిని ఆమె ఇంటిలో ఏకంగా ఆరు గంటలపాటు విచారించారు. భర్త చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యవహారాల్లో ఆమెకేమైనా వాటా ఉందా?.. వియాన్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న శిల్పా ఉన్నట్టుండి గతేడాది ఆ బాధ్యతల నుండి తప్పుకోవడానికి గల కారణాలేంటి? అనే విషయాల గురించి పోలీసులు ప్రశ్నించారని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

మరదిలితో కొత్త యాప్..
రాజ్ కుంద్రా బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని పోర్న్ వీడియోల్లో నటించమని ఒత్తిడి చేస్తున్నట్లు నిరూపితమవడంతో అతనితో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో రాజ్ కుంద్రా బ్యానర్‌లో మూడు సినిమాల్లో నటించడంతో పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన గెహనా వశిష్ట్‌, రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో కుంద్రా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

Gehana Vasisth

 

‘‘రాజ్, ‘బాలీఫేమ్’ పేరుతో కొత్త యాప్ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. రియాలిటీ షోలు, సెలబ్రిటీ ఛాట్ షోలు, మ్యూజికల్ ప్రోగ్రామ్స్ వంటి నాన్ బోల్డ్ కంటెంట్‌తో ఈ యాప్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాడు. అందులో భాగంగా శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి లీడ్‌గా అనుకుని ఓ స్క్రిప్ట్ కూడా ఓకే చేశాం. యాక్ట్ చెయ్యడానికి షమితా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది’ అని గెహనా చెప్పుకొచ్చింది. ఆకాష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘పిలిస్తే పలుకుతా’ సినిమాతో టాలీవుడ్‌లో ఇంట్రడ్యూస్ అయిన షమితా శెట్టి ఆ తర్వాత తెలుగులో నటించలేదు.

Shamita Shetty