Ram Charan : ముంబైలో 1000 మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్.. దాదాపు తొమ్మిది వేల మందికి సేవ!
ముంబైలోని రామ్ చరణ్ అభిమానులు తమ హీరో లాగానే తాము కూడా సేవ కార్యక్రమాలు చేస్తామంటున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 1000 మంది ఫ్యాన్స్ కలిసి..

Mumbai Ram Charan fans conduct service program for 9000 members
Ram Charan Mumbai Fans : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాలతో దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం సిల్వర్‌స్క్రీన్ పై తన గ్రేస్ తోనే కాదు, సొసైటీకి చరణ్ చేసే సేవలు.. ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకునేలా చేసింది. అసోసియేషన్ల, ఎన్జీఓల, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్ ఆపత్కాలంలో పలు రకాల సహాయాలు అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక అభిమాన హీరో సేవ గుణాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్న అభిమానులు.. అదే దారిలో పయనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Upasana : నేను వారసత్వాన్ని కొనసాగించాలని బిడ్డని కనడం లేదు.. ఉపాసన వైరల్ పోస్ట్!
ఈ నేపథ్యంలోనే రక్తదానాలు, అన్నదానాలు, వస్త్రాధానాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ముంబైలోని రామ్ చరణ్ అభిరామానులు మండు వేసవిలో చల్లటి కార్యక్రమం నిర్వహించి వారి సేవా గుణాన్ని చాటుకున్నారు. ముంబై అంధేరి, భీవండి, జుహూలోని శంకర్ ఆలయం పరిసరాల్లో సుమారు తొమ్మిది వేల మందికి మజ్జిగ ప్యాకెట్స్ ని పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. తమ అభిమాన హీరో లాగానే తాము కూడా సమాజం పట్ల బాధ్యత, దయ, కరుణ, నలుగురిలోనూ స్ఫూర్తిపంచాలన్న ధ్యేయంతోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పిన అభిమానులు.. మజ్జిగ పంచడం అనేది ఆ ఆలోచలోని ఒక రూపం అని తెలియజేశారు.
కాగా ఇటువంటి కార్యక్రమంలో గత నెల 29న షోలాపూర్‌లో, ఈ నెల 6న ముంబైలో కూడా నిర్వహించిన అభిమానులు అన్నదానం కార్యక్రమం కూడా చేపట్టారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ పూర్తి చేశారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుంది.

Mumbai Ram Charan fans conduct service program for 9000 members

Mumbai Ram Charan fans conduct service program for 9000 members

Mumbai Ram Charan fans conduct service program for 9000 members

Mumbai Ram Charan fans conduct service program for 9000 members