Sai Abhyankkar : అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్.. ఫారిన్ సింగర్స్ తో..
తాజాగా సాయి అభ్యంకర్ ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా రాకా సినిమా గురించి మాట్లాడాడు. (Sai Abhyankkar)
Music Director Sai Abhyankkar Update on Allu Arjun Raakaa Movie
Sai Abhyankkar : అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రాకా సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు రాకా కోసం. ఇటీవలే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పని చేస్తున్నాడు. తాజాగా సాయి అభ్యంకర్ ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా రాకా సినిమా గురించి మాట్లాడాడు.
Also Read : ఎన్టీఆర్ నీల్ సినిమా కొత్త డేట్ అనౌన్స్.. ఏకంగా సంవత్సరం వాయిదా.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే..
సాయి అభ్యంకర్ మాట్లాడుతూ.. రాకా స్టోరీ విన్నాక చాలా అద్భుతంగా అనిపించింది. అల్లు అర్జున్ గారికి మ్యూజిక్ పై మంచి పట్టు ఉంది. మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. ప్రస్తుతం రాకా మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతుంది. దానికి తగ్గట్టు ఇంటర్నేషనల్ సింగర్స్, లిరిసిస్ట్స్ ని ఈ సినిమా కోసం తీసుకొస్తున్నాం. ఈ రాకా సినిమాతో సరికొత్త సంగీతాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందుతారు అని తెలిపారు.
దీంతో హాలీవుడ్ రేంజ్ లోనే సాంగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి రాకా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటాయో చూడాలి.
Also Read : ఎన్నికల వేల.. కోర్టుకు రాకుండా భార్యతో విజయ్ తెరవెనుక బేరాలా?
