Ram Charan – NTR : మళ్ళీ కలిసిన ఎన్టీఆర్ – చరణ్.. ఇద్దరితో కలిసి ఫొటో దిగిన తమన్.. ఫొటో వైరల్..

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ - చరణ్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ మరింత ఎక్కువైంది.

Ram Charan – NTR : మళ్ళీ కలిసిన ఎన్టీఆర్ – చరణ్.. ఇద్దరితో కలిసి ఫొటో దిగిన తమన్.. ఫొటో వైరల్..

Music Director Thaman Shares Photo with Ram Charan and NTR Photo goes Viral

Updated On : December 23, 2024 / 4:44 PM IST

Ram Charan – NTR : RRR సినిమా సమయంలో చరణ్, ఎన్టీఆర్ రెగ్యులర్ గా కలిసి కనిపించి వాళ్ళెంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది అందరికి తెలిసేలా చేసారు. ఆ సినిమా రిలీజ్ అయి ఆస్కార్ వేడుకల దాకా వెళ్లొచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి కనపడలేదు. తాజాగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఎన్టీఆర్, చరణ్ లతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. దోప్ మూమెంట్. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్ అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. నిన్న గేమ్ చెంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరిగిన సంగతి తెలిసిందే. చరణ్, తమన్ ఇద్దరూ ఈ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లారు. ఈ ఫొటో ఇప్పుడు తమన్ షేర్ చేయడంతో ఎన్టీఆర్ కూడా అమెరికాకు వెళ్ళారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : CM Revanth Reddy : బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల పై సీఎం రేవంత్ రెడ్డిని సమర్ధించిన తెలంగాణ, తెలుగు ఫిలిం ఎగ్జిబిట‌ర్స్‌..

ఇక RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ మరింత ఎక్కువైంది. వీళ్ళిద్దరూ ఆ తర్వాత కలిసి కనపడకపోవడంతో రోజూ సోషల్ మేదయిలో ఫ్యాన్స్ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాదులాడుకుంటున్నారు. ఇన్ని రోజుల తర్వాత సడెన్ గా ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక పలువురు నెటిజన్లు వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు. ఫ్యాన్ వార్స్ చేయడం ఆపేస్తే మంచిది అని కామెంట్స్ చేస్తున్నారు.

Music Director Thaman Shares Photo with Ram Charan and NTR Photo goes Viral

ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో సంక్రాంతికి జనవరి 10న రాబోతున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు చేయనున్నాడు. ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో సక్సెస్ కొత్తగా తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్, దేవర 2 సినిమాలు లైన్లో ఉన్నాయి.