Naga Chaitanya – Akhil : మాస్ ఇమేజ్ కోసం అన్నదమ్ముల పోరాటం.. ఈసారి వచ్చేనా?
అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకునేందుకు కస్టడీ, ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

Naga Chaitanya and Akhil Akkineni with Custody and Agent releases
Naga Chaitanya – Akhil : అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ మాస్ హీరో ఇమేజ్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూనే ఉన్నారు. దడ, దోచేయ్, సవ్యసాచి సినిమాలతో చైతన్య మాస్ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చినా ఆ సినిమాలు పెద్ద విజయాన్ని అందుకోలేక పోయాయి. ఇక అఖిల్ అయితే మొదటి సినిమాతోనే మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని ‘అఖిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. ప్లాప్ లు ఎదురైనా మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకునే వరకు తమ ప్రయత్నం ఆపేదేలే అంటున్నారు.
Agent Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ఏజెంట్.. రన్‌టైమ్ ఎంతంటే?
తాజాగా ఈ ఇద్దరు కస్టడీ, ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. నాగచైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి చేస్తున్న బై లింగువల్ సినిమా కస్టడీ (Custody). ఈ చిత్రంలో చైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మూవీ పై పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అరవింద్ స్వామి విలన్ గా కనిపించబోతున్నాడు. పోస్టర్స్, టీజర్, చైతన్య మేక్ ఓవర్ చూస్తుంటే.. నాగచైతన్య ఈసారి తప్పకుండా మాస్ హిట్టుని అందుకోవడం పక్కా అంటున్నారు. మే 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
Custody Movie: కస్టడీ నుండి ‘టైమ్‌లెస్ లవ్’ అంటూ వింటేజ్ సాంగ్ పట్టుకొస్తున్న చైతూ
ఇక అన్న కంటే ముందే మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకునేందుకు అఖిల్ ఏజెంట్ (Agent) సినిమాతో ఏప్రిల్ 28న వచ్చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథని అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. చూస్తుంటే ఈసారి అక్కినేని బ్రదర్స్ మాస్ హిట్ కొట్టడంలో సందేహం లేదనట్లు తెలుస్తుంది.