Thandel Ticket Rates : తండేల్’ టికెట్ రేట్లు ఎంత పెంచారో తెలుసా..? ఏపీలో అడిగినంత హైక్ ఇచ్చారుగా.. తెలంగాణలో మాత్రం..
బడ్జెట్ పెరిగిన సినిమాలకు టికెట్ రేట్లు పెంపు అడుగుతున్న సంగతి తెలిసిందే.

Naga Chaitanya Sai Pallavi Thandel Movie Ticket Rates Hikes Details
Thandel Ticket Rates : నాగచైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈ సినిమా. నాగచైతన్య మార్కెట్ ని మించి ఈ సినిమాకు బడ్జెట్ ని పెట్టారు. తండేల్ సినిమాకు ఆల్మోస్ట్ 90 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం.
ఇటీవల బడ్జెట్ పెరిగిన సినిమాలకు టికెట్ రేట్లు పెంపు అడుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సీఎం రేవంత్ పుష్ప 2 ఘటన దృష్టిలో ఉంచుకొని టికెట్ రేట్లకు హైక్ ఇవ్వనని చెప్పారు. తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాకు హైక్స్ ఇచ్చినా కోర్టు సీరియస్ అవ్వడంతో తీసేసారు. దీంతో తెలంగాణలో ఇకపై ఏ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండదు అని క్లారిటీ వచ్చేసింది. దీంతో తెలంగాణలో తండేల్ కి ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేదు. స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ లేదు.
ఇక ఏపీలో భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతాం అని పవన్ కళ్యాణ్ సైతం స్వయంగా చెప్పారు. దీంతో ఏపీలో నిర్మాతలు అడిగినంత హైక్స్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి 50 రూపాయలు, మల్టిప్లెక్స్ లకు 75 రూపాయలు పెంచమని ఏపీలో అడిగాము అని అన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్మాతలు అడిగినట్టు సింగిల్ స్క్రీన్స్ కు 50 రూపాయలు, మల్టిప్లెక్స్ లలో 75 రూపాయలు ఒక వారం రోజుల పాటు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. కానీ స్పెషల్ షోలకు మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఏపీలో తండేల్ టికెట్ రేట్లు పెరగనున్నాయి.
Also Read : Anil Ravipudi – CM Chandrababu : సీఎం చంద్రబాబునే పడీ పడీ నవ్వించిన అనిల్ రావిపూడి.. బాలయ్య ఈవెంట్లో..
ఇక తండేల్ సినిమా ఏపీలోని పలువురు మత్స్యకారులు ఫిషింగ్ కోసం గుజరాత్ పోర్ట్ కి వెళ్లగా అక్కడ అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి పట్టుబడి ఎలా తిరిగొచ్చారు అనే రియల్ కథకు ఓ ప్రేమ కథ జోడించి తెరకెక్కించారు. ఇప్పటికే తండేల్ సినిమా నుంచి రిలీజయిన సాంగ్స్, ట్రయలర్, టీజర్స్, సాయి పల్లవి డ్యాన్స్.. సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.