Naga Chaitanya-Sobhita Dhulipala : నాగ‌చైత‌న్య‌-శోభితల పెళ్లి.. అక్కినేని నాగార్జున భావోద్వేగ‌పు పోస్ట్‌..

చైత‌న్య తండ్రి, అక్కినేని నాగార్జున సోష‌ల్ మీడియా వేదిక‌గా కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూనే భావోద్వేగ‌పు పోస్ట్ చేశారు.

Naga Chaitanya-Sobhita Dhulipala : నాగ‌చైత‌న్య‌-శోభితల పెళ్లి.. అక్కినేని నాగార్జున భావోద్వేగ‌పు పోస్ట్‌..

Naga Chaitanya Sobhita Dhulipala wedding Nagarjuna Akkineni emotional post

Updated On : December 4, 2024 / 10:04 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి బాజా మోగింది. నాగచైతన్య, శోభిత ల వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో హిందూ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో శోభిత మెడ‌లో చైత‌న్య మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి, సుహాసిని, కీరవాణి తదితరులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా చైత‌న్య తండ్రి, అక్కినేని నాగార్జున సోష‌ల్ మీడియా వేదిక‌గా కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూనే భావోద్వేగ‌పు పోస్ట్ చేశారు.

Pushpa 2 : పుష్ప 2 మూవీకి బిగ్ షాక్.. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ర‌ద్దు..

‘శోభిత, చైత‌న్య క‌లిసి ఈ అంద‌మైన‌, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణం. నాకెంతో ఇష్ట‌మైన చైత‌న్య‌కి అభినంద‌న‌లు. శోభిత నువ్వు ఇప్ప‌టికే మా జీవితాల్లో ఆనందాన్ని తెచ్చావు. ఈ సంవ‌త్స‌రం ఎంతో ప్ర‌త్యేక‌మైంది. ఏఎన్నార్ శ‌త‌జ‌యంతి సంవ‌త్స‌రంలో ఆయ‌న విగ్ర‌హం చెంత పెళ్లి జ‌ర‌గ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.’ అంటూ నాగార్జున రాసుకొచ్చారు.

PaPa : మారుతీ చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైలర్ రిలీజ్.. తమిళ్ సూపర్ హిట్ ‘డా..డా’ తెలుగులో..

కొన్ని పెళ్లి ఫోటోల‌ను పోస్టు చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి. నెటిజ‌న్లు కొంత జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.