Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘థ్యాంక్ యూ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్....

Naga Chaitanya To Line Up Movie With Bommarillu Bhasker
Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘థ్యాంక్ యూ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ అనే సినిమాలో కూడా చైతూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్టును ఓకే చేసే పనిలో చైతూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!
ఇప్పటికే దర్శకుడు పరశురామ్ పెట్ల చైతూతో ఓ ప్రాజెక్ట్ చేస్తానని గతంలో వెల్లడించడమే కాకుండా, ఆ ప్రాజెక్టును కన్ఫం కూడా చేశారు. కానీ ఆ తరువాత పరశురామ్ పెట్ల సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీంతో తన నెక్ట్స్ మూవీని వేరొక డైరెక్టర్‌తో చేసేందుకు చైతూ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫ్లాపులతో సతమతమవుతున్న తన సోదరుడు అఖిల్ అక్కినేనికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందించిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు చైతూ ఆసక్తిని కనబరుస్తున్నాడట.
Naga Chaitanya: ఎస్‌వీపీ దర్శకుడితో చైతూ.. గీత ఆర్ట్స్ నిర్మాణం?
ఈ డైరెక్టర్ ఇటీవల చైతూకు ఓ కథ చెప్పగా, అది బాగా నచ్చిన చైతూ వెంటనే ఆయనతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.