Naga Chaitanya: ఎస్‌వీపీ దర్శకుడితో చైతూ.. గీత ఆర్ట్స్ నిర్మాణం?

సామ్ తో డైవర్స్ తర్వాత పనిలో పడిన నాగ చైతన్య ఏకంగా అరడజను సినిమాల లైనప్ తో సిద్దమవుతున్నాడు. ఈ ఏడాదిలో బంగార్రాజు సక్సెస్ తో సంక్రాంతి హీరోగా నిరూపించుకున్న చైతూ త్వరలోనే థాంక్యూ చెప్పబోతున్నాడు.

Naga Chaitanya: ఎస్‌వీపీ దర్శకుడితో చైతూ.. గీత ఆర్ట్స్ నిర్మాణం?

Naga Chaitanya

Naga Chaitanya: సామ్ తో డైవర్స్ తర్వాత పనిలో పడిన నాగ చైతన్య ఏకంగా అరడజను సినిమాల లైనప్ తో సిద్దమవుతున్నాడు. ఈ ఏడాదిలో బంగార్రాజు సక్సెస్ తో సంక్రాంతి హీరోగా నిరూపించుకున్న చైతూ త్వరలోనే థాంక్యూ చెప్పబోతున్నాడు. తనకి మనం లాంటి మెమరబుల్ సినిమాను ఇచ్చిన విక్రమ్ కె కుమార్ ఇప్పుడు మరోసారి థాంక్యూ సినిమాకు కలిసి పనిచేస్తున్నాడు. ఆ తర్వాత వరసగా ఐదు సినిమాలు లైన్లో ఉన్నాయి చైతూ కోసం.

Naga Chaitanya : తమిళ్ డైరెక్టర్‌తో నాగ చైతన్య ద్విభాషా సినిమా

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టులో రిలీజ్ కానుండగా.. మరో నాలుగైదు సినిమాలు పట్టాలెక్కనున్నాయి. నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో చైతూ ఒక సినిమా చేయనున్నాడు. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. ఇవి రెండు కాకుండా కిశోర్ తిరుమలకి కూడా చైతూ ఓకే చెప్పేయగా డీవీవీ దానయ్య నిర్మాణంలో.. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది.

Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో చైతూ సినిమా..?

ఇవి కాకుండా చైతూ.. మహేష్ సర్కారు వారి పాట దర్శకుడు పరుశురాం పెట్లా దర్శకత్వంలో మరో సినిమాకు సిద్దమైనట్లు వినిపిస్తుంది. చైతుకి ఇప్పటికే పూర్తి కథ కూడా చెప్పగా చైతూ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని.. గీత ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఎస్వీపీ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌ పైకి రాబోతుందని టాక్ నడుస్తోంది. నిజానికి ‘గీత గోవిందం’ సినిమా తర్వాత ఈ కాంబినేషన్‌ లో సినిమా రావాల్సింది. అయితే.. పరశురామ్ కి సూపర్ స్టార్ తో చాన్స్ వచ్చేసరికి సర్కారు వారి పాట మొదలైంది. ఇప్పుడు చైతూతో ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది.