మరోసారి లేడీ డైరెక్టర్‌తో నాగ శౌర్య

యంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో  ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : February 13, 2020 / 07:33 AM IST
మరోసారి లేడీ డైరెక్టర్‌తో నాగ శౌర్య

Updated On : February 13, 2020 / 7:33 AM IST

యంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో  ప్రారంభం..

తాజాగా ‘అశ్వధ్థామ’ సినిమాతో హిట్ కొట్టిన నాగ శౌర్య తాజాగా మరో సినిమా మొదలు పెట్టాడు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా సూపర్ హిట్ సినిమాలను అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న నూతన చిత్రం (ప్రొడక్షన్ నెం.8) గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైంది.

దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 13 గురువారం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఫిలిం నగర్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి.

ఈనెల 19 నుంచి  చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటీలు, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్దిరోజులలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వంశీ పచ్చి పులుసు, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్ : నవీన్ నూలి,  ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ : పి.డి.వి.ప్రసాద్ నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.

Naga shourya New Movie Launching