Naga Vamsi : వార్ 2 ఫ్లాప్ అని ఒప్పుకున్న నిర్మాత.. బాలీవుడ్ నిర్మాతని నమ్మి.. తప్పు జరిగింది అంటూ..
తాజాగా నాగవంశీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా వార్ 2 సినిమా ఫ్లాప్ అని మాట్లాడారు. (Naga Vamsi)

Naga Vamsi
Naga Vamsi : ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా వార్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించలేకపోయింది. రిలీజ్ కి ముందు ఎంతో హైప్ ఉన్న సినిమా ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను నిరాశపరిచింది.(Naga Vamsi)
తెలుగులో ఈ సినిమాని నిర్మాత నాగవంశీ రిలీజ్ చేశారు. దాదాపు 90 కోట్లకు తెలుగు రైట్స్ కొని ఇక్కడ రిలీజ్ చేసారని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమా నష్టాలనే చూసింది. తాజాగా నాగవంశీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా వార్ 2 సినిమా ఫ్లాప్ అని మాట్లాడారు.
Also See : sridevi vijaykumar : ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. శ్రీదేవి దీపావళి ఫొటోస్.. ఫ్యామిలీతో సరదాగా..
రవితేజ మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వార్ 2 ప్రస్తావన రాగా నాగవంశీ మాట్లాడుతూ.. తప్పు జరిగింది. ఏం చెస్తాం చెప్పండి. నేనైనా, ఎన్టీఆర్ గారైనా ఆదిత్య చోప్రా అనే పెద్దమనిషిని, యష్ రాజ్ ఫిలిమ్స్ ని నమ్మాము. అందరూ తప్పులు చేస్తారు కదా. వాళ్ళ సైడ్ తప్పు జరిగింది. మనం దొరికాము అంతే. నేను తీసిన సినిమా కాదు కదా. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, వాళ్ళని నమ్మాము. మిస్ ఫైర్ అయింది, ట్రోల్ చేసారు. కాకపోతే మనం చేసిన సినిమా కాకుండా బయట సినిమాతో దొరికాము దానికి హ్యాపీ అని అన్నారు. దీంతో నాగవంశీ ఇంత ఓపెన్ గా వార్ 2 సినిమా గురించి ఇలా మాట్లాడటంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
Producer Naga Vamsi admits He and NTR trusted Aditya Chopra and and Yashraj films blindly about #War2 and it Misfired Badly! pic.twitter.com/7K4zmwVHPq
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 21, 2025
Also See : Allu Family : అల్లు ఫ్యామిలీ ఫొటో వైరల్.. ఎవరెవరు ఉన్నారంటే.. అల్లు శిరీష్ కి కాబోయే భార్యని చూశారా?