Jr NTR : తారక్‌తో ఎప్పటికైనా ఐరన్ మ్యాన్ లాంటి సినిమా చేస్తా.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..
తారక్‌తో ఎప్పటికైనా ఐరన్ మ్యాన్ లాంటి సినిమా చేస్తా.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..

Naga Vamsi wants to do Ion Man Character Film with Jr NTR like Super Hero Movies
Jr NTR : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత గ్యాప్ తీసుకొని వరుస సినిమాలు ఓకే చేస్తున్నారు. RRR తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తెరపై కనిపించలేదు. దీంతో అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ని ఎప్పుడు థియేటర్స్ లో చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో ఆల్మోస్ట్ అయిదు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర(Devara) సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి అభిమానులకు మరింత హ్యాపినెస్ ఇచ్చారు. దేవర సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. నాకు సూపర్ హీరోల సినిమాలు అంటే ఇష్టం. మన దగ్గర కూడా అలాంటి ఒక సినిమా తీయాలని నా కోరిక. ఐరన్ మ్యాన్ ఎన్టీఆర్ గారితో తీయాలనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారిలో ఒక మంచి వెటకారం కూడా ఉంటుంది. ఆయన ఆ పాత్రకు సరిపోతారు. ఎన్టీఆర్ గారిని ఐరన్ మ్యాన్ లా చూపించాలనుకుంటున్నాను. అవుతుందో లేదో తెలీదు కానీ ఎన్టీఆర్ తో మాత్రం ఐరన్ మ్యాన్ లాంటి సినిమా తీయాలని ఉంది అని అన్నారు.