Bigg Boss 5 : కంటెస్టెంట్స్ పై సీరియస్ అయిన నాగార్జున.. హౌస్ లో ఎవరు ఎవర్ని కాటేస్తున్నారు?

గతవారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ పై సీరియస్ అయ్యారు. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో కూడా నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. ర‌వి.. డ‌బ్బుల గురించి రాలేద‌ని,

Bigg Boss 5 : కంటెస్టెంట్స్ పై సీరియస్ అయిన నాగార్జున.. హౌస్ లో ఎవరు ఎవర్ని కాటేస్తున్నారు?

nagarjuna

Updated On : October 31, 2021 / 10:52 AM IST

Bigg Boss 5 :  గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లోనే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతవారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ పై సీరియస్ అయ్యారు. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో కూడా నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. ర‌వి.. డ‌బ్బుల గురించి రాలేద‌ని, నా భార్యాపిల్ల‌లు ఎలా ఉన్నారో చెప్పండ‌ని, లేదంటే బిగ్‌బాస్ నుంచి పంపించండి అని మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించాడు నాగ్‌. ఆ వీడియో చూపించి నువ్వు వెళ్లిపోతానంటే చెప్పు గేట్లు ఓపెన్ చేస్తాను అని సీరియస్ అయ్యాడు. ఇక కెప్టెన్సీ టాస్క్‌ను మ‌ధ్య‌లో వదిలేసిన‌ యానీ మాస్ట‌ర్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి ఎందుకు అని ప్రశ్నించి ఇక‌పై డ‌ల్‌గా ఉండొద్ద‌ని హెచ్చరించాడు. కాజ‌ల్‌ను తొండాట‌ వ‌ద్ద‌ని ప‌ద్ధ‌తిగా ఆడ‌మ‌ని తెలిపాడు. అందరి ఫోటోలని మిషన్ తో చింపిన నాగ్.. స‌న్నీ ఫొటోను కోపంతో చేతుల‌తోనే చింపేసాడు. వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా జైలుకు పంపించినా నీలో మార్పు రాలేదా? ఒక వ్య‌క్తి ప‌ట్టుకున్న బ్యాగును త‌న్న‌డం కరెక్టేనా? కొట్టడానికి వెళ్ళిపోతున్నావ్? అంటూ సీరియస్ అయ్యాడు నాగార్జున. కోపాన్ని కంట్రోల్ లో పెట్టుకోకపోతే వేస్ట్ అంటూ సన్నీకి క్లాస్ పీకాడు నాగార్జున.

RGV : దిశా ఎన్కౌంటర్ పై ఆర్జీవీ సినిమా ట్రైలర్ విడుదల

త‌ర్వాత కంటెస్టెంట్స్ తో వైకుంఠ‌పాళి గేమ్ ఆడించాడు నాగార్జున. బిగ్ బాస్ హౌస్ లో మిమ్మల్ని పైకి వెళ్ల‌కుండా కాటేసేది, ముందుకు వెళ్ల‌డానికి నిచ్చెన‌లా సహాయం చేసేది ఎవ‌రో చెప్పాల‌ని ఆదేశించాడు.

ముందుగా కాజ‌ల్‌.. త‌ను ముందుకు వెళ్ల‌డానికి సాయ‌ప‌డే నిచ్చెన మాన‌స్ అని, పాములా అడ్డుకునేది మాత్రం శ్రీరామ్ అని చెప్పింది.
ర‌వి.. త‌న‌ను పైకి ఎక్కించేది షన్ను అని, కాజల్‌ పాము అని అన్నాడు.
జెస్సీ.. విశ్వ నిచ్చెన అని, నాకు గొడవలు నచ్చవు, అన్నిటికి గొడవ పడే సన్నీనే పాము అని తెలిపాడు.
ప్రియాంక‌.. మాన‌స్ త‌న‌ను ముందుకు తీసుకెళ్లే నిచ్చెన‌గా, లోబోను పాముగా తెలిపింది.
స‌న్నీ.. మాన‌స్ నిచ్చెన అని, సైలెంట్‌గా ఉంటూ కాటేసే ష‌ణ్ముఖ్ పాము అని అన్నాడు.
యానీ.. ర‌విని నిచ్చెన‌గా, కాజ‌ల్‌ను పాముగా చెప్పింది.
విశ్వ‌.. లోబోను నిచ్చెనగా, కాజ‌ల్‌ను పాముగా చెప్పాడు.
లోబో.. ర‌వి నిచ్చెన అని, స‌న్నీ పాము అని తెలిపాడు.
శ్రీరామచంద్ర‌.. యానీ నిచ్చెన అని, పాములో ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ కాజ‌ల్‌కు ఉన్నాయ‌ని అన్నాడు.
మాన‌స్‌.. స‌న్నీని నిచ్చెన‌గా, ర‌విని పాముగా చెప్పాడు.
ఇక‌ కెప్టెన్ ష‌ణ్ముఖ్‌.. సిరిని నిచ్చెన‌గా, ర‌విని పాముగా చెప్పాడు.
చివరగా సిరి.. షన్నుని నిచ్చెన‌గా, స‌న్నీని పాముగా చెప్పింది.

AHA : ఆహా అవార్డ్స్.. మొట్టమొదటి ఓటిటి అవార్డ్స్.. మీరే ఎన్నుకోండి

అందరు ఊహించినట్టే ఎక్కువగా గొడవపడే సన్నీని రోజులాగే టార్గెట్ చేశారు. మొత్తంగా కాజ‌ల్‌ను నాగిణిగా, స‌న్నీని పాముగా ప్ర‌క‌టించాడు నాగార్జున. మరోసారి సన్నీకి దెబ్బ పడినట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా సన్నీ మారకపోతే కష్టమే అని అంటున్నారు.

.