Nag100: ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీతో 25 ఏళ్ల యువకుడిగా.. కొత్త సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగార్జున
తన 100(Nag100)వ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన కింగ్ నాగార్జున.
Nagarjuna interesting comments about the story of his 100th film.
- నాగార్జున 100వ సినిమాలో అద్భుతం
- 25 ఏళ్ళ యువకుడిగా నాగ్
- నాగార్జున 100వ ప్రాజెక్ట్ కీలక అప్డేట్
Nag100: అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ(Nag100) సినిమా చేస్తున్నారు. అందుకే, ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అక్కినేని అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయేలా ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పటికే 45 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, అత్యాధునిక ‘డీ-ఏజింగ్’ (De-aging) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
దీనివల్ల, నాగార్జున మళ్లీ 25 ఏళ్ల నవ యువకుడిగా మెరిసిపోనున్నారు. కథలో భాగంగా ఆయన 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకు వివిధ దశల్లో, విభిన్న గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నాగార్జున తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇది కేవలం సాంకేతికతతో కూడుకున్న కథ మాత్రమే కాదు, ఒక బలమైన ఎమోషనల్ డ్రామా కూడా ఉంది అని ఆయన తెలిపారు.
Priyanka Chopra: స్వర్ణ దేవాలయ సేవలో ‘ప్రియాంక చోప్రా’.. గిన్నెలు కడుగుతూ కనిపించిన గ్లోబల్ బ్యూటీ
సున్నా నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి స్ఫూర్తిదాయక ప్రయాణంతో పాటు, తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన సెంటిమెంట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఆయన వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ 100వ చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని నాగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జునను మళ్లీ పాత రోజుల్లోలా యంగ్ లుక్‌లో చూడబోతుండటంతో అక్కినేని అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే సెంటిమెంట్ కలగలిసిన ఈ చిత్రం టాలీవుడ్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్. మరి సరికొత్త కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.
