Priyanka Chopra: స్వర్ణ దేవాలయ సేవలో ‘ప్రియాంక చోప్రా’.. గిన్నెలు కడుగుతూ కనిపించిన గ్లోబల్ బ్యూటీ
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రియాంక చోప్రా.
priyanka chopra at amritsar golden temple
- అమృత్సర్లో భక్తురాలిగా మారిన ప్రియాంక
- సామాన్యురాలిగా గిన్నెలు కడిగిన ప్రియాంక
- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్లో ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నా, తన భారతీయ మూలాలను, సంప్రదాయాలను ఏమాత్రం మర్చిపోలేదని మరోసారి ప్రూవ్ చేసింది. తాజాగా మంగళవారం నాడు(మార్చి 31) ఆమె అమృత్సర్లోని పవిత్ర స్వర్ణ దేవాలయాన్ని (గోల్డెన్ టెంపుల్) సందర్శించారు. సాధారణ భక్తురాలిలా సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన ఆమె, తలపై దుపట్టా కప్పుకుని ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆలయ సిబ్బంది, అభిమానులతో ఎంతో మర్యాదగా మాట్లాడారు.
చాలా మందికి అడిగిన వెంటనే సెల్ఫీలు కూడా ఇచ్చారు. అయితే, ఈ పర్యటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఆలయంలో భక్తులు వాడిన పాత్రలను శుభ్రం చేస్తున్న మహిళలతో కలిసి ప్రియాంక(Priyanka Chopra) కూడా స్వయంగా గిన్నెలు కడిగారు. బయట ఎంత ఫేమ్, స్టార్డమ్ ఉన్నప్పటికీ, దైవ సన్నిధిలో ఏమాత్రం గర్వం లేకుండా ఇలా సేవలో పాల్గొనడం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక, ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ఇంటెర్నేషనల్ మూవీ వారణాసి. మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
