Site icon 10TV Telugu

Nagarjuna : సీఎం రేవంత్ చెప్పారు.. నాగార్జున చేశారు.. నాగ్ స్పెషల్ వీడియో వైరల్..

Nagarjuna Promoting Telangana Tourism Special Video goes Viral

Nagarjuna Promoting Telangana Tourism Special Video goes Viral

Nagarjuna : ఇటీవల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో తెలంగాణలో సినిమా అభివృద్ధి గురించి, సినిమా వాళ్ళు డ్రగ్స్ నిర్మూలన, తెలంగాణ టూరిజం అభివృద్ధికి సపోర్ట్ చేయాలని సీఎం రేవంత్ కోరినట్టు, దానికి సహకారం ఇస్తామని చెప్పినట్టు దిల్ రాజు తెలిపారు.

Also Read : Game Changer : రేపే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. వీళ్లందరి గేమ్ మారుస్తుందా ?

దీంతో ఈ మీటింగ్ అయిన తర్వాత సీఎం తెలంగాణ అభివృద్ధి కోసం చెప్పడంతో ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్ డ్రగ్స్ కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం కోసం స్పెషల్ వీడియోలు చేశారు. తాజాగా నాగార్జున తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేస్తూ ఓ స్పెషల్ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ అంతా తిరిగాను. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. జొదెగాట్ వ్యాలీ, మిట్టె వాటర్ ఫాల్స్, బొగత వాటర్ ఫాల్స్, వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్ ఉన్నాయి. రామప్ప టెంపుల్ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ మీరు చూడాలి. యాదగిరి గుట్ట అక్కడికి చాలా సార్లు వెళ్ళాను. మంచి దైవ భక్తి అనుభూతి కలిగింది. ఇక తెలంగాణ భోజనంలో నాకు నచ్చింది జొన్నరొట్టె, అంకాపూర్ చికెన్, సర్వపిండి చాలా చాలా ఇష్టం. ఇరానీ చాయ్, కరాచీ బిస్కెట్స్, హైదరాబాద్ బిర్యానీ అయితే వరల్డ్ ఫేమస్, ఇవి మర్చిపోలేను. వీటి గురించి చెప్తుంటేనే నోరూరుతుంది. ఇక్కడి ప్రజలు చాలా మంచోళ్లు అందర్నీ ప్రేమతో స్వాగతం పలుకుతారు. అందరూ తెలంగాణ వచ్చి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.

Also Read : Pragya Jaiswal : బాలయ్య బాబుని తెగ పొగిడేసిన హీరోయిన్.. సినిమాలో నా ఫేస్ మీద మట్టి, దుమ్ము కొట్టారు.. డాకు మహారాజ్..

సీఎం తెలంగాణ టూరిజం ప్రమోషన్స్ లో సినిమా వాళ్ళు కూడా భాగం అవ్వాలని టాలీవుడ్ మీటింగ్ లో చెప్పడంతో నాగార్జున ఇప్పుడు తెలంగాణ టూరిజం ప్రమోట్ చేస్తూ వీడియో చేయడం విశేషం. మరింతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేస్తూ వీడియోలు చేయనున్నారని తెలుస్తుంది.

Exit mobile version