Pragya Jaiswal : బాలయ్య బాబుని తెగ పొగిడేసిన హీరోయిన్.. సినిమాలో నా ఫేస్ మీద మట్టి, దుమ్ము కొట్టారు.. డాకు మహారాజ్..
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నేడు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపింది.

Pragya Jaiswal Interesting Comments on Daaku Maharaaj and Balakrishna
Pragya Jaiswal : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నేడు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపింది.
బాలకృష్ణతో వరుసగా అఖండ, డాకు మహారాజ్, అఖండ-2 సినిమాలు చేయడం పై ప్రగ్యా స్పందిస్తూ.. బాలకృష్ణ గారితో వరుసగా సినిమాలు చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. కరోనా సమయంలో ఎవరూ సినిమాలు చేయలేదు. అలాంటి సమయంలో బోయపాటి శ్రీను గారు అఖండ కథ చెప్పి అంత గొప్ప సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అఖండ సినిమా నా కెరీర్ లోనే పెద్ద హిట్. ఇప్పుడు మళ్ళీ డాకు మహారాజ్ సినిమాలో చేస్తున్నాను. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. ఆ తర్వాత అఖండ 2లో కూడా చేయబోతున్నాను అని తెలిపింది.
Also See : GV ప్రకాష్ కింగ్‌స్టన్ టీజర్ రిలీజ్.. సముద్రంలో దయ్యాలు?.. ఇదేదో ‘దేవర’లా ఉందే..
బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు. ఒక్క ఛేంజ్ కూడా చేయరు. సెట్స్ లో బాలకృష్ణ గారు అందరితో సరదాగా ఉంటారు. బాలయ్య గారిని చూస్తే సూపర్ పవర్స్ ఉన్నట్టు కనిపిస్తారు. ఆయన చేసినట్టు ఎవరూ చేయలేరు. ఆయనకు ముహుర్తాలు, పంచాంగం, ఆస్ట్రాలజీ అన్ని తెలుసు. ఆయనతో ఉంటే చాలా నేర్చుకోవచ్చు. రోజూ పూజ చేస్తారు ఆయన. అఖండలో అఘోర క్యారెక్టర్ అయితే ఆయన చేసినట్టు ఎవరూ చేయలేరు అంటూ తెగ పొగిడేసింది ప్రగ్యా.
డాకు మహారాజ్ లో తన పాత్ర గురించి చెప్తూ.. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో కనిపిస్తాను. ఇది డీ గ్లామరస్ రోల్. మొదటిసారి నేను డీ గ్లామరస్ రోల్ చేశాను. ఈ పాత్ర కోసం నా ఫేస్ మీద మట్టి, దుమ్ము కొట్టారు. బాగా నలిగిపోయిన చీరలు కట్టారు. రాజస్థాన్ ఎడారిలో ఎండలో, ఫ్యాన్స్ పెట్టి అక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆ పాత్ర చూసుకుంటే నాకు సంతృప్తి ఇచ్చింది అని తెలిపింది.
Also Read : Nithya Menen : సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానన్న స్టార్ హీరోయిన్ .. నేషనల్ అవార్డు రావడంతో..
అలాగే.. నా పుట్టిన రోజు నాడే డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి సంవత్సరం నేను పుట్టిన రోజు చేసుకుంటాను. కానీ బాలకృష్ణ గారి సినిమా అనేది ఒక సెలబ్రేషన్. ఆయనతో కలిసి చేసిన సినిమా నా బర్త్ డేకి రిలీజ్ అవ్వడం అదృష్టం. అలాగే సంక్రాంతి పండగ కూడా కలిసి వచ్చింది. ప్రతిసారి నేను నా పుట్టిన రోజుని ఇంట్లో వాళ్ళతో గడుపుతాను కానీ ఈసారి మాత్రం డాకు మహారాజ్ సినిమాతో గడుపుతాను అని తెలిపింది ప్రగ్యా. అలాగే తనకు రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ లాంటి డైరెక్టర్స్ తీసే భారీ సినిమాల్లో నటించాలని ఉందని, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉందని తెలిపింది.
డైరెక్టర్ బాబీ, నిర్మాణ సంస్థ గురించి మాట్లాడుతూ.. బాబీ గారు నాకు నా మొదటి సినిమా కంటే ముందు నుంచి తెలుసు. ఎప్పటి నుంచో ఆయనతో పనిచేయాలి అనుకుంటున్నాను. ఇప్పటికి ఆ ఛాన్స్ వచ్చింది. బాబీ గారు సెట్ లో ఎంత వర్క్ ఉన్నా, సెట్ లో ఏం జరుగుతున్నా కంగారుపడకుండా కూల్ గా ఉంటారు అని తెలిపింది. తెలుగులో బిగ్గెస్ట్ బ్యానర్స్ లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ లో అవకాశం రావడం ఆనందంగా ఉంది. నాగవంశీ గారు గొప్ప నిర్మాత. ఆయన దర్శకులను, సినిమాలో పనిచేసే వాళ్ళను నమ్ముతారు. అందరిని స్వేచ్ఛగా పని చేసుకోనిస్తారు అని తెలిపారు. అలాగే ఈ సినిమాలో దబిడి దబిడి సాంగ్ నాకు బాగా నచ్చిందని, తమన్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మ్యూజిక్ ఇస్తారని చెప్పింది.
ఇక ప్రగ్యా జైస్వాల్ చేతిలో ప్రస్తుతం అఖండ 2 తో పాటు టైసన్ నాయుడు, మరో హిందీ సినిమా ఉన్నాయి.