Game Changer : రేపే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. వీళ్లందరి గేమ్ మారుస్తుందా ?

గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ కే కాదు శంకర్ కి కూడా ఇంపార్టెంట్ మూవీ కాబోతోంది.

Game Changer : రేపే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. వీళ్లందరి గేమ్ మారుస్తుందా ?

Ram Charan Shankar Dil Raju Kiara Advani Anjali Game Changer Releasing Tomorrow

Updated On : January 9, 2025 / 8:42 PM IST

Game Changer : రేపు జనవరి 10 గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతోంది. ఇంట్రస్టింగ్ కాంబినేషన్, భారీ బడ్జెట్, అంతకుమించి ప్రమోషన్లు, కావల్సినంత బజ్ వీటన్నింటితో గేమ్ ఛేంజర్ ఈ శుక్రవారం థియేటర్లోకొస్తోంది. అయితే ఈ సినిమా అటు చరణ్ , శంకర్, కియారా, దిల్ రాజు, అంజలికి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తుందా? వీళ్ల కెరీర్ కి గేమ్ ఛేంజర్ కాబోతోందా చూడాలి.

చరణ్, శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు దాదాపు 400కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ ఈ శుక్రవారం థియేటర్లోకొస్తోంది. ఇప్పటికే ఫుల్ బజ్ తో పాటు లేటెస్ట్ గా రిలీజైన అన్‌ప్రెడిక్టబుల్ సాంగ్ తో హైప్ వచ్చేసింది సినిమాకి. ఫుల్ పాజిటివ్ టాక్ తో రిలీజవుతోంది గేమ్ ఛేంజర్. రెండేళ్లనుంచి సాలిడ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న చరణ్ ఫాన్స్ గేమ్ చేంజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

RRR లాంటి భారీ సినిమా తర్వాత గేమ్ ఛేంజర్ తో తన పాన్ ఇండియా స్టామినా చూపించుకోవడానికి రెడీ అవుతున్నారు చరణ్. 4 డిఫరెంట్ లుక్స్ లో అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు గేమ్ ఛేంజర్. చరణ్ కి ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వాల్సిందే.

Also Read : Pragya Jaiswal : బాలయ్య బాబుని తెగ పొగిడేసిన హీరోయిన్.. సినిమాలో నా ఫేస్ మీద మట్టి, దుమ్ము కొట్టారు.. డాకు మహారాజ్..

గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ కే కాదు శంకర్ కి కూడా ఇంపార్టెంట్ మూవీ కాబోతోంది. ఎందుకుంటే శంకర్ కొన్నాళ్లుగా ట్రాక్ తప్పుతున్నారు. అంతేకాక రీసెంట్ గా రిలీజైన భారతీయుడు 2తో ఫ్లాప్ అందుకున్నారు. సో గేమ్ ఛేంజర్ తో శంకర్ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితి. అందుకే ఈ సినిమా శంకర్ కి చాలా ఇంపార్టెంట్ కాబోతోంది. ఇప్పటికే 3 ఏళ్ల పాటు 400 కోట్ల బడ్జెట్ తో, పాటలకే దాదాపు 75కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్ తన స్టైల్లో సినిమాని లావిష్ గా తీశారు. మరి శంకర్ మార్క్ మేకింగ్ కి తోడు పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ఈ 10న రాబోతున్న గేమ్ ఛేంజర్ హిట్ అయ్యి కెరీర్ ని ఛేంజ్ చేస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు శంకర్.

హీరోయిన్ కియారా అద్వానీ కూడా టాలీవుడ్ లో మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే గేమ్ ఛేంజర్ హిట్ అయ్యి తీరాల్సిందే. గతంలో చరణ్ తోనే వినయవిధేయరామ సినిమా చేసి ఫ్లాప్ చూసింది. బాలీవుడ్ లో బిజీ ఉన్న ఈ భామ టాలీవుడ్ లో బిజీ అవ్వాలంటే గేమ్ ఛేంజర్ హిట్ అవ్వాల్సిందే.

ఇక అంజలి వరుసగా సినిమాలు చేస్తున్నా, అవకాశాలు ఉన్నా స్టార్ డం మాత్రం రాలేదు. ఈ సినిమాలో తన నటన అద్భుతమని శంకర్ స్వయంగా పొగిడి నేషనల్ అవార్డు వస్తుంది అన్నాడు. దీంతో ఈ సినిమాపైనే అంజలి ఆశలు పెట్టుకుంది. అవకాశాలతో పాటు కాస్త స్టార్ డమ్ కూడా ఈ సినిమాతో వస్తుందని భావిస్తుంది.

Also See : GV ప్రకాష్ కింగ్‌స్టన్ టీజర్ రిలీజ్.. సముద్రంలో దయ్యాలు?.. ఇదేదో ‘దేవర’లా ఉందే..

ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన దిల్ రాజు గత కొన్ని రోజులుగా సరైన హిట్ చూడలేదు. ఇటీవల దిల్ రాజు స్వయంగా వారసుడు, ఫ్యామిలీ స్టార్ సినిమాలు నిరాశపరిచాయని, ఈ సినిమా తనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. దాంతో ఈ సినిమా హిట్ అయితే దిల్ రాజుకి బాగా డబ్బులతో పాటు మళ్ళీ హిట్ కెరీర్ వస్తుందని ఫీల్ అవుతున్నాడు.

200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసుకున్న గేమ్ ఛేంజర్ కి ఓవర్సీస్ లో కూడా మంచి హైప్ ఉంది. అదీకాక మన సినిమాలకు ఎక్కువ గా కలెక్షన్లు ఓవర్సీస్ నుంచే వస్తున్నాయి. అందుకే అక్కడ కూడా గ్రాండ్ ప్రమోషన్లు చేసిన గేమ్ ఛేంజర్ ఇప్పటికే ప్రీమియర్లతో హంగామా చేస్తున్నాడు. ఇక నిన్నటి వరకూ తెలంగాణలో టికెట్ రేట్లు పెరుగుతాయా లేదా అన్న టెన్షన్ లో ఉన్న టీమ్ కి టికెట్ రేట్లు పెరగడంతో ఆ టెన్షన్ కూడా తీరి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ శుక్రవారం భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది గేమ్ ఛేంజర్. ఫస్ట్ డే 100 నుంచి 150 కోట్ల కలెక్షన్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న గేమ్ ఛేంజర్ ఏ రేంజ్ లో రికార్డుల్ని బద్దలుకొట్టి బాక్సాఫీస్ గేమ్ ఛేంజర్ అవుతాడో చూడాలి.