Samantha-Naga Chaitanya: సమంతే విడాకులు అడిగిందని నేను అనలేదు- నాగార్జున

సమంత-నాగ చైతన్యల విషయంలో తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తల గురించి నాగార్జున స్పందించారు..

Samantha-Naga Chaitanya: సమంతే విడాకులు అడిగిందని నేను అనలేదు- నాగార్జున

Nagarjuna

Updated On : January 27, 2022 / 7:24 PM IST

Samantha and Naga Chaitanya: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంత గతేడాది అక్టోబర్ 2న తామిద్దరం భార్య భర్తలుగా విడిపోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అప్పటినుండి ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు కానీ.. విడిపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

Oke Oka Jeevitham : ‘అమ్మా.. నే కొలిచే శారదవే.. నిత్యం నను నడిపే సారథివే’.. సిరివెన్నెలకే సాధ్యం..

కట్ చేస్తే.. గురువారం సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం గురించి నాగార్జున ఓ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాతో పాటు వెబ్ సైట్స్, టీవీ ఛానళ్లలోనూ వార్తలు వచ్చాయి. చైతన్యని సమంతే విడాకులు కావాలని అడిగిందని ఆ వార్తల సారాంశం.

Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..

దీంతో ఈ వ్యవహారం గురించి నాగార్జున స్పందించారు. తాను చెప్పినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, ఇలాంటి పుకార్లు నమ్మొద్దంటూ ట్వీట్ చేశారాయన. ‘సామాజిక మాద్యమాల్లో నా పేరుతో వస్తున్న కామెంట్స్‌లో నిజం లేదు.. సమంత-నాగ చైతన్యల విషయంలో నేను మాట్లాడినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం.. దయచేసి రూమర్లను న్యూస్‌గా క్రియేట్ చెయ్యవద్దని మీడియాకు నా విజ్ఞప్తి’’ అంటూ నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు.