Shobha Shetty : శోభా శోట్టికి నాగార్జున పంపిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టికి నాగార్జున సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఆ గిఫ్ట్ ఏంటో తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో చేసి చూపించారు శోభా శెట్టి.

Shobha Shetty : శోభా శోట్టికి నాగార్జున పంపిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

Shobha Shetty

Updated On : January 5, 2024 / 5:58 PM IST

Shobha Shetty : శోభా శెట్టి పేరు కంటే  ‘కార్తీక దీపం’ సీరియల్ మోనిత అంటే అందరూ గుర్తు పట్టేస్తారు. తెలుగు బిగ్ బాస్ 7 లో ఛాన్స్ కొట్టేసి అందర్నీ అలరించిన శోభకు ఇటీవల నాగార్జున ఒక గిఫ్ట్ పంపారు. ఆ గిఫ్ట్ అందుకుని సంతోషంలో మునిగిపోయిన శోభ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆ గిఫ్ట్ ఏంటో రివీల్ చేసారు.

Kannappa : ‘కన్నప్ప’తో మరో మంచు వారసుడు ఎంట్రీ.. మోహన్ బాబు మనవడు రాబోతున్నాడు..

విలనిజం పండించడంలో నటి శోభా శెట్టి సిద్ధహస్తులు. ‘కార్తీక దీపం’ సీరియల్ చూసిన వాళ్లు నటి మోనితని నటనను ఎప్పటికీ మర్చిపోరు. కుట్రలు, కుతంత్రాలను తన హావభావాలలో చూపిస్తూ చాలా బాగా నటించారు. ఆ సీరియల్‌లో ఆమెతో నటిస్తున్న వారిని తన నటనతో ఆమె డామినేట్ చేసేసేవారు. ఆ సీరియల్ తర్వాత ఆమెకు మరింత పేరు తెచ్చింది తెలుగు బిగ్ బాస్ 7. ఇక ఈ షోలో కూడా తనదైన ఆట తీరుతో అలరించారు. అప్పుడప్పుడు ఆమెలో ఉన్న మోనిత బయటకు వచ్చేది.

Prabhas : బాబోయ్.. మన ప్రభాసా ఇలా విష్ చేసింది.. మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ పోస్ట్..

విషయానికి వస్తే శోభా శెట్టికి నాగార్జున ఒక సర్పైజ్ గిఫ్ట్ పంపారు. అదేంటంటే? షోలో ఒకసారి నాగార్జున ధరించిన టీ షర్ట్ చూసి శోభ ముచ్చటపడింది. తనకు కావాలని అడిగింది. ఆ విషయం అక్కడతో మర్చిపోయింది. శోభ ఊహించని విధంగా తను అడిగిన టీ షర్ట్‌ను నాగార్జున ఆమె అడ్రస్‌కు సర్‌ప్రైజ్‌గా పంపించారు. ఆ గిఫ్ట్ అందుకున్న శోభ సంతోషంతో ఆ టీ షర్ట్ వేసుకుని ఫోటో షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసారు. అనుకున్నది సాధించారు అంటూ చాలామంది కామెంట్స్ చేశారు.