Namitha : కవలలకు జన్మనిచ్చిన నమిత.. కృష్ణాష్టమి రోజు స్పెషల్ న్యూస్ అనౌన్స్..

తాజాగా శుక్రవారం కృష్ణాష్టమి రోజున తను కవలలకు జన్మనిచ్చాను అని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నమిత. తన భర్తతో కలిసి కృష్ణాష్టమి రోజు గుడికి వెళ్లి తన కవలలతో ఆశీర్వాదాలు తీసుకొని ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసి...........

Namitha : కవలలకు జన్మనిచ్చిన నమిత.. కృష్ణాష్టమి రోజు స్పెషల్ న్యూస్ అనౌన్స్..

namitha gave birth to twins

Updated On : August 20, 2022 / 6:48 AM IST

Namitha :  సొంతం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి జెమిని, సింహా, బిల్లా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించి తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది హీరోయిన్ నమిత. వీరేంద్ర చౌదరి అనే ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరంగా ఉంది నమిత. ఇటీవలే కొన్ని రోజుల క్రితం తాను తల్లిని కాబోతున్నాను అని ప్రకటించి తన బేబీ బంప్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Vijay Devarakonda : అప్పుడు ప్రేక్షకులు నన్ను మర్చిపోవాలని కోరుకుంటాను.. గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు..

తాజాగా శుక్రవారం కృష్ణాష్టమి రోజున తను కవలలకు జన్మనిచ్చాను అని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నమిత. తన భర్తతో కలిసి కృష్ణాష్టమి రోజు గుడికి వెళ్లి తన కవలలతో ఆశీర్వాదాలు తీసుకొని ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసి.. ”నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. ఇవాళ కృష్ణాష్టమి రోజు మీ అందరికి చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్, ప్రేమానురాగాలు నా పిల్లలకి కూడా కావాలి. నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు సపోర్ట్ చేసి, నన్ను జాగ్రత్తగా చూసుకున్న హాస్పిటల్, డాక్టర్స్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి ధన్యవాదాలు” అని తెలిపింది. దీంతో నమిత ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు, ప్రముఖులు నమితకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.