Bhagavanth Kesari : ఆయుధం పట్టుకున్న బాలయ్య.. ఇంకో 70 రోజులే..
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్.

Bhagavanth Kesari new poster
Bhagavanth Kesari new poster : నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్. శ్రీలీల(Sreeleela) కీలక పాత్ర పోషిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలకు 70 రోజుల సమయం మాత్రమే ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో బాలయ్య గొడ్డలి లాంటి ఆయుధాన్ని పట్టుకుని శత్రులవుపై దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. బాలయ్య 109వ ప్రాజెక్టును ఇటీవలే పట్టాలెక్కించారు. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని లాంచ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇనుప పెట్టెలో కత్తులు, గొడ్డలి, సుత్తి, సిగరెట్ పెట్టె, మందు బాటిల్, తుపాకీ గుళ్లు ఉన్నాయి. పోస్టర్‌పై 1982 అని రాసి ఉంది. పోస్టర్ ఆకట్టుకుంది.
Theatres will erupt in 70 DAYS with Natasimham #NandamuriBalakrishna‘s arrival ❤️?
7️⃣0️⃣DAYS TO GO for #BhagavanthKesari ❤️?
Massive Release In Theatres On October 19th?@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/XFUmuoTpnl
— Shine Screens (@Shine_Screens) August 10, 2023