NBK 109 Update : బాలకృష్ణ NBK 109 అప్డేట్ వచ్చేసింది.. అదిరిపోయిన గ్లింప్స్..
నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా NBK 109 సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Nandamuri Balakrishna Director Bobby NBK 109 Movie Update Glimpse Released
Balakrishna NBK 109 Update : వరుస సినిమాల హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య బాబు తన 109వ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అదిరిపోయే మాస్ సినిమా అని హింట్ ఇచ్చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.
నిన్న ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. తాజాగా నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా NBK 109 సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమా నుంచి ఓ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఆ గ్లింప్స్ చూసేయండి..
ఇక గ్లింప్స్ లో దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు.. అంటూ విలన్ తో డైలాగ్ చెప్పించగా వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ.. ఇలాంటి పదాల అర్ధమే తెలియని అసురుడు అనే డైలాగ్ తో బాలయ్యకు ఎలివేషన్ ఇప్పిస్తూ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ గ్లింప్స్ వైరల్ గా మారింది.