Arjun S/O Vyjayanthi : ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ రివ్యూ.. తల్లి కోసం కొడుకు చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..
ఆ క్లైమాక్స్ కి కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాడు అంటే సాహసం అనే చెప్పొచ్చు.

Nandamuri Kalyan Ram Vijayashanti Arjun Son Of Vyjayanthi Movie Review and Rating
Arjun S/O Vyjayanthi Movie Review : కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నేడు ఏప్రిల్ 18 ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. వైజయంతి(విజయశాంతి) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతని కొడుకు అర్జున్(కళ్యాణ్ రామ్)ని పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకుంటుంది. కానీ తన తండ్రిని చంపినవాళ్ళల్లో ఒకరిని అర్జున్ హత్య చేస్తాడు. దీంతో తల్లే అర్జున్ పై హత్య కేసు పెట్టి దూరమవుతుంది. ఆ కేసు నడుస్తుండగానే అర్జున్ వైజాగ్ నే తన కంట్రోల్ తెచ్చుకొని ఒక రౌడీగా ఎదుగుతాడు. వైజాగ్ లోని ఓ జాలరి పేటలో తన భార్యతో కలిసి ఉంటాడు అర్జున్.
తల్లి తనని దూరం పెట్టినా అర్జున్ తల్లిని చూడాలని, కలవాలని, మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు. అర్జున్ భార్య చిత్ర(సయీ మంజ్రేకర్) ప్రెగ్నెంట్ అయిన సమయంలో తన తల్లి వైజయంతి పై అటాక్ జరుగుతుంది. అసలు వైజయంతి పై అటాక్ చేసింది ఎవరు? తల్లి కొడుకులు విడిపోవడానికి అసలు కారణం ఏంటి? అర్జున్ ఎందుకు హత్య చేస్తాడు? అర్జున్ జాలరి పేటలో ఎందుకు ఉంటాడు? అర్జున్ రౌడీగా మారడానికి కారణం ఏంటి? అర్జున్ – వైజయంతి మళ్ళీ కలిసారా? అర్జున్ తన తల్లిని ఎలా కాపాడుకున్నాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Nani – Suriya – Ajay Devgn : పాన్ ఇండియా సమ్మర్ ఫైట్.. నాని వర్సెస్ సూర్య వర్సెస్ అజయ్ దేవగణ్..
సినిమా విశ్లేషణ.. కొడుకు ఏదో తప్పు చేస్తే తండ్రి లేదా తల్లి దూరం పెట్టడం, అతను చేసింది రైట్ అని చివర్లో తెలియడం.. ఇలాంటి లైన్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా ఇదే కథతో తల్లి వర్సెస్ కొడుకుగా సాగుతూనే సెంటిమెంట్ తో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ వర్సెస్ వైజయంతి అని, ఇద్దరూ మాట్లాడుకోవట్లేదు అని చూపించి ఎందుకు అని ఒక ఆసక్తి నెలకొల్పుతారు. ఫస్ట్ హాఫ్ రొటీన్ కమర్షియల్ సినిమాల లాగే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి అసలు ఫైట్ వేరు అని ఇంట్రెస్ట్ నెలకొల్పుతారు. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పి కథలో వదిలేసిన చాలా పాయింట్స్ కి లింక్ కలుపుతారు. దీంతో సెకండ్ హాఫ్ బాగానే వర్కౌట్ అయింది. క్లైమాక్స్ అయితే సాగదీశారు.
సినిమా అంతా హీరో తల్లి కోసం ఏం చేసాడు, తల్లిని కాపాడుకోవడానికి ఏం చేసాడు అనే సాగుతుంది. అయితే క్లైమాక్స్ లో తన తల్లిని కాపాడుకోవడానికి హీరో చేసే ఓ పని అందరికి షాక్ ఇస్తుంది. అసలు ఇలాంటి ఆలోచన డైరెక్టర్ కి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతారు. తల్లి సెంటిమెంట్ వర్కౌట్ అయినా చాలా వరకు రొటీన్ కమర్షియల్ సినిమాలాగే అనిపిస్తుంది. సినిమాల్లో లాజిక్స్ వెతక్కూడదు కానీ లాజిక్ లెస్ సీన్స్ చాలానే ఉంటాయి. యాక్షన్ సీన్స్ మాత్రం భారీగా డిజైన్ చేసారు. కళ్యాణ్ రామ్, విజయశాంతిలకు ఎలివేషన్స్ కూడా భారీగానే ఇచ్చారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. కళ్యాణ్ రామ్ రొటీన్ కమర్షియల్ పాత్రలో బాగానే చేసినా క్లైమాక్స్ లో మాత్రం అదరగొట్టాడు. ఆ క్లైమాక్స్ కి కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాడు అంటే సాహసం అనే చెప్పొచ్చు. ఒకప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో మెప్పించిన విజయశాంతి చాన్నాళ్ల తర్వాత మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అదరగొట్టింది. ఈ ఏజ్ లో కూడా భారీ యాక్షన్స్ చేసి మెప్పించింది.
హీరోయిన్ సయీ మంజ్రేకర్ పాత్రకు అసలు స్కోప్ లేదు. ఆ పాత్ర లేకపోయినా కథ నడుస్తుంది. శ్రీకాంత్ పోలీస్ పాత్రలో బాగానే మెప్పించాడు. బబ్లూ పృథ్వీరాజ్ కి మంచి పాత్ర పడింది. బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ నెగిటివ్ షేడ్స్ లో ఓకే అనిపించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రివ్యూ.. ప్రేతాత్మ వర్సెస్ శివశక్తి..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా కొట్టారు. పాటలు ఒక్కసారి వినొచ్చు. రెగ్యులర్ కథని కొత్త స్క్రీన్ ప్లేతో కొత్త క్లైమాక్స్ తో చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు అనిపిస్తుంది.
మొత్తంగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తల్లి కొడుకు సెంటిమెంట్ తో సాగే రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.