Ante Sundaraniki: అంటే.. నాని సినిమాకు మరీ ఇంత తక్కువ టీఆర్పీనా..?
నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘అంటే సుందరానికీ’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, మలయాళ బ్యూటీ నజ్రియా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

Nani Ante Sundaraniki Gets Low TRP
Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘అంటే సుందరానికీ’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, మలయాళ బ్యూటీ నజ్రియా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
Ante Sundaraniki : మరో కొత్త రికార్డు సృష్టించిన నాని.. అమెరికాలో ఏడు 1 మిలియన్ డాలర్ సినిమాలు..
ఇక ఈ సినిమాను ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ చేయగా, అక్కడ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో థియేటర్లలో చూడని వారు ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. కాగా, తాజాగా ఈ సినిమా బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయ్యింది. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని టీవీలో ఈ సినిమాను టెలికాస్ట్ చేయగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు దారుణమైన రెస్పాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
Ante Sundaraniki: అంటే.. సుందరానికి ఫస్ట్ వీక్ కలెక్షన్స్
అంటే సుందరానికి కేవలం 1.88 టీర్పీ రేటింగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. నాని సినిమాకు ఈ రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్ రావడంతో అందరూ షాకవుతున్నారు. నాని సినిమాలకు సాధారణంగానే మంచి ఆదరణ ఉంటుందని.. కానీ, అంటే సుందరానికీ చిత్రానికి ఈ టీఆర్పీ రేటింగ్ రావడం నిజంగా నమ్మలేకపోతున్నామని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, నాని ప్రస్తుతం దసరా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.