Dasara : దసరా బ్లాక్ బాస్టర్ పార్టీ.. దావత్ పెడుతున్న నాని..

నాని (Nani) దసరా (Dasara) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీ సృష్టిస్తూ బ్లాక్ బాస్టర్ రా బ్యాంచత్ అంటుంది. దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ దావత్ ప్లాన్ చేశారు.

Dasara : దసరా బ్లాక్ బాస్టర్ పార్టీ.. దావత్ పెడుతున్న నాని..

Nani Dasara movie success party celebrations at Karimnagar - Pic Source Twitter

Updated On : April 4, 2023 / 12:18 PM IST

Dasara : నాని (Nani), కీర్తి సురేష్ (Keerthy Suresh), దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ రా బ్యాంచత్ అంటూ సందడి చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా సంచలనాలు క్రియేట్ చేస్తుంది. మొదటి రోజు 38 కోట్లు, రెండో రోజు 53 కోట్లు, మూడో రోజు 71 కోట్లు, నాలుగో రోజు 87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని నాని కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

Renu Desai : కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. రేణుదేశాయ్ పోస్ట్ పవన్ గురించా?

సోమవారం (ఏప్రిల్ 3) నాటికి ఈ మూవీ 46.88 కోట్ల షేర్ సాధించి ఆల్మోస్ట్ 99 శాతం బడ్జెట్ ని రికవరీ చేసేసింది. రిలీజ్ అయిన 5 రోజులోనే బొడ్జెట్ మొత్తం రికవరీ చేయడం, 100 కోట్ల మార్క్ కి కూడా దగ్గరిలో ఉండడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతుంది. దీంతో గ్రాండ్ దావత్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 5న కరీంనగర్ లోని SRR గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ దావత్ పార్టీ మొదలు కానుంది. అయితే ఈ పార్టీకి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అన్నది తెలియజేయలేదు.

Baby Movie : ‘బేబీ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ స్టార్ సింగర్.. సూపర్ అంటున్న మ్యూజిక్ లవర్స్!

కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ ఇచ్చిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ కి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక ఈ సినిమాలో నాని ఒక కంప్లీట్ రగ్గడ్ లుక్ లో కనిపించి నటవిశ్వరూపం చూపించాడనే చెప్పాలి. రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, సుకుమార్.. ఇలా ప్రతి ఒకరు ఈ సినిమాకి ఫిదా అయ్యిపోతున్నారు. మరి ఈ సినిమా మునుముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.