Hi Nanna Song : నాని ‘హాయ్ నాన్న’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. మృణాల్ – నాని మధ్య రొమాంటిక్ సాంగ్..
హాయ్ నాన్న మ్యూజికల్ జర్నీని కూడా మొదలుపెట్టారు. నిన్న సినిమాలోని ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా తాజాగా నేడు సమయమా.. అంటూ సాగే పూర్తి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Nani Mrunal Thakur Hi Nanna Movie First lyrical song Samayamaa Released
Hi Nanna Song : నేచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత చేస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతుంది. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఒక పక్క షూటింగ్ జరుపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు. ఇటీవల హాయ్ నాన్న సినిమా నుంచి ప్రోమో రిలీజ్ చేసి సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పారు.
ఈ నేపథ్యంలోనే హాయ్ నాన్న మ్యూజికల్ జర్నీని కూడా మొదలుపెట్టారు. నిన్న సినిమాలోని ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా తాజాగా నేడు సమయమా.. అంటూ సాగే పూర్తి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘సమయమా’ సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ హీరో – హీరోయిన్స్ మధ్య సాగే ఒక మంచి రొమాంటిక్ లవ్ సాంగ్.
Shahrukh Khan : జవాన్ సినిమాకి సౌత్ వాళ్ళే ఎక్కువగా పనిచేశారు.. ఈ విజయం వాళ్లదే.. షారుఖ్ కామెంట్స్..
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ ‘హేశం అబ్దుల్ వహాబ్’ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. హేశం అబ్దుల్ ఇటీవల విజయ్ ‘ఖుషి’ సినిమా ఆల్బమ్ తో మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మ్యూజిక్ పై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది.