Laal Singh Chaddha : నాగ చైతన్య క్యారెక్టర్ నేను చెయ్యాల్సింది..

నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పక్కన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకున్నాడు..

Laal Singh Chaddha : నాగ చైతన్య క్యారెక్టర్ నేను చెయ్యాల్సింది..

Nani

Updated On : September 12, 2021 / 2:37 PM IST

Laal Singh Chaddha: సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఒక హీరో చెయ్యాల్సిన సినిమా అనుకోని కారణాల వల్ల మరో హీరో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే టాలెంటెడ్ టాలీవుడ్ హీరో నాని మాత్రం బాలీవుడ్‌ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పక్కన నటించే ఛాన్స్ వస్తే వదులుకున్నాడు.

Tuck Jagadish : అలాగైతే నాకు నేనే బ్యాన్ చేసుకుంటాను..

ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నారు.

Laal Singh Chaddha : ఆమిర్ ఖాన్‌తో ఫొటో కోసం ఎగబడ్డ వెంకటాపురం ప్రజలు..

ఈ మూవీతో యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకుముందు ఈ క్యారెక్టర్ కోసం వెర్సటైల్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని సంప్రదించగా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చైతుతో రీ ప్లేస్ చేస్తున్నారు.

Naga Chaitanya Bollywood Entry : ఆమిర్ ఖాన్ సినిమాతో చైతు బాలీవుడ్ ఎంట్రీ..

అయితే ఈ రోల్ కోసం చైతు కంటే ముందు నేచురల్ స్టార్ నానిని సంప్రందించారట. కొద్ది నెలల క్రితం స్వయంగా ఆమిర్ ఖాన్, నానికి కాల్ చేసి ‘లాల్ సింగ్ చద్దా’ లో క్యారెక్టర్ గురించి చెప్పారట. వెతుక్కుంటూ వచ్చిన బాలీవుడ్ అవకాశం.. అందులోనూ ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ అనుకుని ఎగిరి గంతేసినంత పని చేసినా.. ఎంత ప్రయత్నించిన డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో నిరాశగా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు నాని.

Jeh : బాల నటుడిగా కరీనా రెండో కుమారుడు..!

దీంతో పాటు పలు హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని నాని చెప్పారు. ‘నిన్ను కోరి’ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణతో కలిసి నాని నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’ వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..