Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ కలెక్షన్స్.. మూడు రోజుల్లో నాని అదరగొట్టేసాడు.. ‘దసరా’ కలెక్షన్స్ దాటిస్తాడా?
సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

Nani Saripodhaa Sanivaaram Movie Collections
Saripodhaa Sanivaaram : నాని, ప్రియాంక మోహన్ జంటగా ఇటీవల సరిపోదా శనివారం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. SJ సూర్య ఈ సినిమాలో విలన్ గా నటించగా SJ సూర్య పాత్రకు బాగా పేరొచ్చింది. సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ సినిమా 24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
తాజాగా సరిపోదా శనివారం సినిమా మూడు రోజుల్లో 52 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా దసరా రికార్డ్ దాటుతుండగా అని నాని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాని కెరీర్ లో దసరా అత్యధికంగా 110 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు వర్షాలు భారీగా పడుతుండటంతో, తెలుగు రాష్ట్రాల్లో వర్షాల విపత్తుతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో నాని 100 కోట్లయినా సరిపోదా శనివారం సినిమాకు సాధిస్తాడా అని చర్చగా మారింది.
Bhaga Bhaga Bhaga..
Bhaga Bhaga Bhaga 🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/zsVDRl772X— DVV Entertainment (@DVVMovies) September 1, 2024
అమెరికాలో మాత్రం ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసి 2 మిలియన్ డాలర్స్ కి దూసుకెళ్తున్నారు. సరిపోదా శనివారం సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 90 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. మరి నాని ఈ సినిమాతో దసరా రికార్డ్ బద్దలు కొడతాడా, కనీసం బ్రేక్ ఈవెన్ చేస్తాడా చూడాలి.