Saripodhaa Sanivaaram Twitter Review : ‘సరిపోదా శనివారం’ ట్విట్టర్ రివ్యూ.. నాని, ఎస్‏జే సూర్యల న‌ట విశ్వ‌రూపం..!

బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో వేరియేషన్ చూపించి మంచి విజయాలు అందుకున్న నాని న‌టించిన మూవీ ‘సరిపోదా శనివారం’.

Saripodhaa Sanivaaram Twitter Review : ‘సరిపోదా శనివారం’ ట్విట్టర్ రివ్యూ.. నాని, ఎస్‏జే సూర్యల న‌ట విశ్వ‌రూపం..!

Nani Saripodhaa Sanivaaram Twitter Review

Updated On : August 29, 2024 / 8:52 AM IST

Saripodhaa Sanivaaram Twitter Review : బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో వేరియేషన్ చూపించి మంచి విజయాలు అందుకున్న నాని న‌టించిన మూవీ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దాన‌య్య‌, క‌ళ్యాణ్ దాస‌రిలు నిర్మించారు. ప్రియాంక మోహన్ క‌థ‌నాయిక. ఎస్ జే సూర్య విలన్ గా న‌టించ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, సాంగ్స్ మూవీపై అంచ‌నాల‌ను పెంచేశాయి. ఈ క్ర‌మంలో భారీ అంచ‌నాల మ‌ధ్య నేడు (ఆగ‌స్టు 29)న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఓవ‌ర్సీస్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో ఫ‌స్ట్ ఫో ప‌డిపోయింది. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ఫ‌స్టాఫ్ అదిరిపోయింద‌ని అంటున్నారు. నాని, ఎస్‌జే సూర్య‌లు త‌మ న‌ట‌న‌ల‌తో అద‌ర‌గొట్టేశార‌ని చెబుతున్నారు. అయితే.. సెకండాఫ్ వ‌చ్చే స‌రికి కాస్త సాగ‌దీత‌గా ఉంద‌ని కామెంట్లు చేస్తున్నాయి. ఇక‌ జేక్స్ బిజాయ్ అందించిన నేప‌థ్య సంగీతం పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Bigg Boss Buzzz : బిగ్‌బాస్ బ‌జ్‌కు ఊహించని హోస్ట్.. ఎవ‌రో తెలుసా..?