Bigg Boss Buzzz : బిగ్‌బాస్ బజ్‌కు ఊహించని హోస్ట్.. ఎవరో తెలుసా..?
తెలుగు బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Bigg Boss Buzzz 8 host was ambati arjun
తెలుగు బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ఎనిమిదో సీజన్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎవరు వెళ్లనున్నారు అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఆకట్టుకున్నాయి. సీజన్ 7 మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ బజ్‌కు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు బయటకు వచ్చిన తరువాత బజ్‌లో పాల్గొంటారు. హౌస్‌లో జరిగిన విషయాల గురించి, ఎలిమినేషన్ అవ్వడానికి గల కారణాలను పంచుకుంటారు. దీన్ని మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ హోస్ట్ చేస్తుంటారు. ఈ సీజన్ 8కి ఎవరు చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌లో అలరించిన శివాజీ, శోభ శెట్టి, ప్రియాంక, అశ్విని శ్రీ ఇలాంటి పేర్లు వినిపించాయి.
ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ప్రొమో కూడా విడుదలైంది. బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా అర్జున్ అంబటి వ్యవహరిస్తున్నాడు. ‘టైమ్ బాగుంటే సంతోషం, టైమ్ బాగోకపోతే సంకోచం. టైమ్ బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు.. అలా టైమ్ బాగున్న కొంతమంది బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు. మరి వాళ్ల టైమ్ బ్యాడ్ అయితే? బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.. ఈ సీటు యమ హాటు.’ అంటూ అర్జున్ డైలాగ్‌తో ప్రోమో అదిరిపోయింది.