Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? దసరా కంటే తక్కువే..?

నాని కెరీర్లో అత్యధికంగా దసరా సినిమా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా దానికంటే తక్కువే కలెక్ట్ చేసినట్టు సమాచారం.

Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? దసరా కంటే తక్కువే..?

Nani SJ Suryah Saripodhaa Sanivaaram Movie First Day Collections

Updated On : August 30, 2024 / 11:59 AM IST

Saripodhaa Sanivaaram : నాని, SJ సూర్య పోటీపడి మరీ నటించిన సినిమా సరిపోదా శనివారం నిన్న ఆగస్టు 29న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తుంది. అయినా ముందు నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో కలెక్షన్స్ భారీగా వచ్చాయని తెలుస్తుంది.

నాని కెరీర్లో అత్యధికంగా దసరా సినిమా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా దానికంటే తక్కువే కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇంకా DVV ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా కలెక్షన్స్ అనౌన్స్ చేయకపోయినా సినీ ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం వైరల్ అవుతుంది.

Nani – Priyadarshi : నాని ‘కోర్ట్’లో ప్రియదర్శి సినిమా.. పోస్టర్ రిలీజ్..

సరిపోదా శనివారం సినిమా మొదటి రోజు తెలుగులో ఆల్మోస్ట్ 9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందట. అలాగే ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో 4 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. మొత్తంగా సరిపోదా శనివారం సినిమా మొదటి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం, వీకెండ్ ఉండటం కలిసొచ్చి ఈ సినిమాకు కలెక్షన్స్ మరింత పెరిగి 100 కోట్లు రీచ్ అవుతుందేమో చూడాలి.

నాని గత సినిమాలు దసరా 110 కోట్లు గ్రాస్, హాయ్ నాన్న 75 కోట్ల గ్రాస్ వసూలు చేసాయి. మరి సరిపోదా శనివారం ఎన్ని కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందో చూడాలి.