Nani – Priyadarshi : నాని ‘కోర్ట్’లో ప్రియదర్శి సినిమా.. పోస్టర్ రిలీజ్..

తాజాగా నాని తన నిర్మాణ సంస్థ నుంచి కొత్త సినిమాని ప్రకటించాడు.

Nani – Priyadarshi : నాని ‘కోర్ట్’లో ప్రియదర్శి సినిమా.. పోస్టర్ రిలీజ్..

Nani Announced A Movie Under his Production With Priyadarshi as Hero

Updated On : August 30, 2024 / 10:59 AM IST

Nani – Priyadarshi : నాని ఓ పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అనే తన నిర్మాణ సంస్థ నుంచి సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. తాజాగా నాని తన నిర్మాణ సంస్థ నుంచి కొత్త సినిమాని ప్రకటించాడు.

Also Read : Rana – RGV : రానా విత్ ఆర్జీవీ.. స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుంది.. ఆర్జీవీ పోస్ట్ వైరల్..

ఇటీవల నాని డార్లింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రియదర్శిని హీరోగా పెట్టి తన నిర్మాణ సంస్థలో సినిమా తీస్తున్నాను అని ప్రకటించాడు. తాజాగా నేడు ఆ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ రివీల్ చేసారు. ప్రియదర్శి హీరోగా నాని నిర్మాతగా రామ్ జగదీశ్ దర్శకత్వంలో ‘కోర్ట్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్, మోషన్ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేసారు.

Image

ఈ పోస్టర్ లో కోర్టు బోనులో న్యాయ దేవత విగ్రహం ఉన్నట్టు ఉంది. ఈ పోస్టర్, మోషన్ పోస్టర్ చూస్తుంటే సినిమా సీరియస్ కోర్ట్ డ్రామాగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రియదర్శి కూడా వరుస సినిమాలతో మెప్పిస్తున్నాడు మరో ఈ కోర్టులో ఏం చేస్తాడో చూడాలి. మీరు కూడా ఈ కోర్ట్ మోషన్ పోస్టర్ వీడియో చూసేయండి.