Nani : 17 ఏళ్ళ నుంచి ఆ షర్ట్ దాచుకున్న నాని.. ఎందుకంత స్పెషల్..?

జగపతి బాబు నాని పాత షర్ట్ ని ఒకటి తీసి చూపించారు. ఆ షర్ట్ తో ఉన్న ఫొటోని చూపించారు. దీంతో నాని ఆశ్చర్యపోయి..(Nani)

Nani : 17 ఏళ్ళ నుంచి ఆ షర్ట్ దాచుకున్న నాని.. ఎందుకంత స్పెషల్..?

Nani

Updated On : September 1, 2025 / 9:52 AM IST

Nani : న్యాచురల్ స్టార్ నాని ఇటీవల హిట్ 3 సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. త్వరలో ది ప్యారడైజ్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నాడు.(Nani)

తాజాగా నాని జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే షోలో గెస్ట్ గా వచ్చారు. ఈ షో లో అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో జగపతి బాబు నాని పాత షర్ట్ ని ఒకటి తీసి చూపించారు. ఆ షర్ట్ తో ఉన్న ఫొటోని చూపించారు. దీంతో నాని ఆశ్చర్యపోయి ఆ షర్ట్ వెనక ఉన్న కథ గురించి చెప్పాడు.

Also Read : Mega Cousins : అల్లు రామలింగయ్య – కనకరత్నమ్మలతో మెగా కజిన్స్ చైల్డ్ ఫొటో వైరల్.. చరణ్, బన్నీ ఎంత క్యూట్ గా ఉన్నారో..

నాని మాట్లాడుతూ.. నా ఫస్ట్ ఫోటోషూట్ ఆ షర్ట్ మీదే. అష్టాచెమ్మా సినిమాకు ఆడిషన్స్ కోసం ఫొటోలు కావాలి అంటే ఇక్కడే జూబ్లీహిల్స్ లో పార్క్ లో ఆ షర్ట్ మీద అప్పటికప్పుడు మాములుగా ఫొటోలు తీసి పంపించాను. ఆ తర్వాత అంజు(నాని భార్య)ని మొదటిసారి కలవడానికి వెళ్లినప్పుడు కూడా అదే టీ షర్ట్ వేసుకున్నాను. అందుకే అది నాకు చాలా స్పెషల్. అంజు ఆ షర్ట్ ని దాచింది. తనే మీకు ఇచ్చిందేమో అని అన్నాడు. అలా నానికి ఆ టీ షర్ట్ చాలా స్పెషల్ అని, అందుకే 17 ఏళ్ళు అయినా అలాగే దాచినట్టు తెలిపాడు.

Also Read : Nani Son : నాని కొడుక్కి కాలు ఫ్రాక్చర్.. జున్ను అర్ధరాత్రి పూట ఆ మాట అనేసరికి.. నాని ఎమోషనల్..