Solo Movie : నారా రోహిత్ ‘సోలో’ కు పదేళ్లు..

నారా రోహిత్ హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్న ‘సోలో’ మూవీ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..

Solo Movie : నారా రోహిత్ ‘సోలో’ కు పదేళ్లు..

Solo 10 Years

Updated On : November 25, 2021 / 8:07 PM IST

Solo Movie: నారా రోహిత్, నిషా అగర్వాల్ (కాజల్ అగర్వాల్ సిస్టర్) జంటగా.. ‘యువత’, ‘ఆంజనేయులు’ తర్వాత పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘సోలో’.. ఎస్.వి.కె. సినిమా బ్యానర్ మీద వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ 2011 నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021 నవంబర్ 25 నాటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.

Akhanda : బాలయ్య ఫంక్షన్‌కి బన్నీ గెస్ట్!

అనాథ అయిన ఓ కుర్రాడు పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని, అలాంటమ్మాయిని ప్రేమించిన తర్వాత ఆమె ఫ్యామిలీ నుండి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందింది ‘సోలో’ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.

Solo

 

పరశురామ్ కథ, కథనం, డైలాగులతో పాటు దర్శకత్వ ప్రతిభతో తనను తాను తాను నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం, దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. దర్శకుడు, నటీనటులతో పాటు ఎంటైర్ టీమ్ మెంబర్స్ కెరీర్‌లో ‘సోలో’ స్పెషల్ ఫిలింగా గుర్తుండిపోతుంది.

Akhanda : రికార్డులు మొదలు.. సరైన మాస్ బొమ్మ పడితే.. బాలయ్యను ఆపడం కష్టం..