గొడవలు పెట్టుకోకండి అని చెప్పిన చిరంజీవి

  • Published By: vamsi ,Published On : March 4, 2019 / 03:47 PM IST
గొడవలు పెట్టుకోకండి అని చెప్పిన చిరంజీవి

Updated On : March 4, 2019 / 3:47 PM IST

తెలుగు సినిమా వాళ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్నికలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు. మార్చి 10వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో “మా”కు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 800మంది సభ్యులు ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. ‘మా’ అధ్యక్ష పదవికి సీనియర్ హీరో నరేష్ పోటీ పడుతున్నారు. నరేష్ ప్యానెల్ లో జీవితా, రాజశేఖర్‌‌తో పాటు మరికొంతమంది పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హీరోలను కలిసి మద్దతు అడుగున్న నరేష్ ప్యానెల్.. మహేష్ బాబును తొలుత కలిసి మద్దతు అడిగారు. ఇఫ్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా చిరంజీవి సానుకూలంగా స్పందించినట్లు నరేష్ ట్వీట్ చేసి, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో అనేక గొడవలు జరిగిన నేపథ్యంలో ఈసారి అటువంటి గొడవలు జరగకుండా ఉండాలని అందరూ భావిస్తున్నారు.