Allu Arjun : నేషనల్ అవార్డుతో ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్.. గ్రాండ్ వెల్కమ్ పలికిన ఫ్యాన్స్..
మొదటి నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ తెలుగు గడ్డ మీదకు తీసుకు వస్తుండడంతో అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు.

National award winner Allu Arjun receive grand welcome at his residence from fans
Allu Arjun : నిన్న అక్టోబర్ 17న సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం ఘనంగా జరిగింది. 2021 సంవత్సరానికి గాను ఇచ్చిన ఈ అవార్డుల్లో విజేతలు అందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తమ అవార్డులను అందుకున్నారు. ఇక ఈ ఏడాది అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తన నటనకు గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. నిన్న ఈ అవార్డుని అందుకున్న బన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, తొలి సెలబ్రిటీస్ అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు.
69 ఏళ్ళ జాతీయ పురస్కారంలో బెస్ట్ యాక్టర్ అవార్డు తెలుగు వారికీ ఒక లోటుగా మిగిలిపోయింది. ఇప్పటివరకు తెలుగు సినిమా పలు కేటగిరిలో జాతీయ అవార్డులను అందుకున్నా.. బెస్ట్ యాక్టర్ అవార్డు మాత్రం అందుకోలేకపోయింది. ఒక కలలా ఉన్న ఆ అవార్డుని ఇప్పుడు అల్లు అర్జున్ తెలుగు గడ్డ మీదకు తీసుకు వస్తుండడంతో అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. నిన్న అవార్డుని అందుకున్న అల్లు అర్జున్.. నేడు హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇక బన్నీ కోసం అక్కడే ఎదురు చూస్తున్న అభిమానులు.. అక్కడ పండుగా వాతావరణం సృష్టించారు.
Also read : War 2 : హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ షురూ.. లీకైన ఫోటోలు వైరల్..
బాణాసంచా కలుస్తూ పూల వర్షం కురిపిస్తూ అల్లు అర్జున్ కి ఘనంగా ఆహ్వానం పలికారు. ఇక అభిమానుల అందరికి థాంక్యూ చెబుతూ, అభివాదం పలుకుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అభిమానులు తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అల్లు అర్జున్ మొదటి నేషనల్ అవార్డుని తీసుకు రావడమే కాదు, రీజనల్ సినిమా, కమర్షియల్ సినిమా అని తక్కువగా చూసే ఎంతో మందికి అల్లు అర్జున్ గట్టి సమాధానం ఇచ్చి.. పుష్ప తగ్గేదేలే అనిపించాడు.