Nani : దసరాకి నాని ‘దసరా’..

దసరా రోజు నేచురల్ స్టార్ నాని నటించబోయే కొత్త సినిమా ‘దసరా’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది..

Nani : దసరాకి నాని ‘దసరా’..

Nani

Updated On : September 16, 2021 / 12:31 PM IST

Nani: నేచురల్ స్టార్ నాని రీసెంట్‌గా ‘టక్ జగదీష్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్లలో వచ్చుంటే బాగుండేది అనే మాట అంటున్నారు కానీ వేరే దారిలేక నిర్మాతలు ఓటీటీలోనే విడుదల చేసేశారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కువ మంది చూసిన మూవీగా నిలిచింది.

Tuck Jagadish : నాని నిర్మాతలు సేఫ్.. ప్రాఫిట్ ఎంతంటే..

దీని తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే.. సుందరానికి’ సినిమాలు చేస్తున్నాడు నాని.. ఈ రెండు సినిమాలకు సంబంధిచిన షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే నాని ఇంతలో మరో కొత్త సినిమాకి ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఆ మూవీకి ‘దసరా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం.

Shyam SinghaRoy : ఆరున్న‌ర కోట్ల‌తో హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో నాని శ్యామ్ సింగ‌రాయ్’ ఫైన‌ల్ షెడ్యూల్..

తెలంగాణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా రూపొందబోయే ఈ సినిమా షూటింగ్ దసరా నాడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని.. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఆరోజే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

Tamannaah : నిర్మాతలకు సారీ చెప్పిన తమన్నా..