Snakes & Ladders : అమెజాన్ లో కొత్త వెబ్ సిరీస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ చూశారా..? నవీన్ చంద్ర ఏమన్నాడంటే..

అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

Snakes & Ladders : అమెజాన్ లో కొత్త వెబ్ సిరీస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ చూశారా..? నవీన్ చంద్ర ఏమన్నాడంటే..

Naveen Chandra Snakes & Ladders Web Series Streaming in Amazon Prime OTT

Updated On : October 19, 2024 / 7:26 AM IST

Snakes & Ladders : స్టోన్ బెంచ్, అమెజాన్ ప్రైమ్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’. కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మాణంలో అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో.. నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, స్రింద, శ్రీజిత్ రవి, సమ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్యకుమార్, తరుణ్, సాషా భరేన్.. పలువురు కీలక పాత్రలు పోషించారు. నిన్న అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ తోనే ఈ సిరీస్ పై ఆసక్తి పెంచారు. కొంతమంది పిల్లల చుట్టూ ఆసక్తికరంగా ఈ సిరీస్ సాగుతుంది.

Also Read : Arthamainda Arun Kumar season 2 teaser : ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజ‌న్ 2’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. ఈ సారి రెట్టింపు న‌వ్వులు..

తాజాగా ఈ సిరీస్ కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టగా ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేసిన నవీన్ చంద్ర మాట్లాడుతూ.. నేను వరుసగా సిరీస్ లు చేస్తున్నాను. ఇప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ తో వచ్చాను. ఓ నలుగురు టీనేజ్ పిల్లల జీవితంలో జరిగిన ఓ అనూహ్య ఘటన, దాంట్లోంచి ఆ పిల్లలు ఎలా బయటకు వచ్చారు అని ఆసక్తికరంగా ఉంటుంది ఈ సిరీస్. అమెజాన్ ప్రైమ్‌లో ఇది నా మూడో ప్రాజెక్ట్. నాకు వరుస ఆఫర్లు ఇస్తున్న అమెజాన్ టీంకు ధన్యవాదాలు. ఇందులో నటించిన నలుగురు పిల్లలు కూడా కొత్త వాళ్లు అయినా బాగా నటించారు. షూట్ మొత్తం కొడైకెనాల్‌లో చేశాం. ఆరు భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది అని తెలిపారు.

నటుడు నంద మాట్లాడుతూ.. ఇది క్రైమ్ థ్రిల్లర్ అయినా డార్క్ కామెడీ కూడా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. 9 ఎపిసోడ్స్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి అని తెలిపారు. మీరు కూడా అయి థ్రిల్లింగ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి.

Naveen Chandra Snakes & Ladders Web Series Streaming in Amazon Prime OTT