Balakrishna – Naveen Polishetty : బాలయ్యపై కామెడీగా ఓ కవిత చెప్పిన నవీన్ పోలిశెట్టి.. ఏమని చెప్పాడో తెలుసా?

బాలయ్య కోసం ఓ కవిత రాసుకొచ్చానని నా స్టైల్ లో చెప్తానని ఓ డప్పు వాయించే వ్యక్తిని పిలిచి డప్పు వాయిస్తుంటే నవీన్ కామెడీగా ఈ కవిత చెప్పాడు.

Balakrishna – Naveen Polishetty : బాలయ్యపై కామెడీగా ఓ కవిత చెప్పిన నవీన్ పోలిశెట్టి.. ఏమని చెప్పాడో తెలుసా?

Naveen Polishetty tells a Comedy Rhyming Poet on Balakrishna in Unstoppable Show

Updated On : December 7, 2024 / 9:23 AM IST

Balakrishna – Naveen Polishetty : ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఇప్పటికే 5 ఎపిసోడ్స్ రాగా తాజాగా ఆరో ఎపిసోడ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ కి నవీన్ పోలిశెట్టి, శ్రీలీల వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఎపిసోడ్ లో మొదట నవీన్ పోలిశెట్టి వచ్చాడు. నవీన్ రాగానే బాలయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆయన కోసం ఓ కవిత రాసుకొచ్చానని నా స్టైల్ లో చెప్తానని ఓ డప్పు వాయించే వ్యక్తిని పిలిచి డప్పు వాయిస్తుంటే నవీన్ కామెడీగా ఈ కవిత చెప్పాడు.

Also Read : Naveen Polishetty : పెద్ద యాక్సిడెంట్ అయింది.. చేతికి మూడు ఫ్రాక్చర్స్.. బాలయ్య షోలో నవీన్ పోలిశెట్టి..

నవీన్ పోలిశెట్టి బాలయ్య గురించి..

బాలకృష్ణ గారు వెయ్యని గెటప్ ఎక్కడ .. ఆయన వెయ్యని గెటప్ ఎక్కడ..
50 ఇండస్ట్రీ ఇక్కడ..

ఫ్యాన్స్ కి ఇష్టం ఆయన ప్రతీ రూపం.. కానీ నా ఫేవరేట్ భైరవ ద్వీపం..

ఆల్వేస్ యంగ్.. ఏజింగ్ లైక్ ఫైన్ వైన్..
టైం ట్రావెల్ చెయ్యగలరు మన ఆదిత్య 369..

యంగ్‌స్టర్స్ కి ఆయన ఒక బడ్డీ.. గ్యాంగ్ స్టర్స్ కి ఆయన ఒక సమరసింహా రెడ్డి..

అయన ఇలాగే మనల్ని ఎంటర్టైన్ చేయాలయ్యా.. యా యా యా బాలయ్య.. అంటూ సరదాగా చెప్పి బాలయ్య బాబుని ఇంప్రెస్ చేసాడు నవీన్. ఆ తర్వాత బాలయ్య నటనలో 50 ఏళ్ళు పూర్తిచేసినందుకు బాలయ్య ఫోటో ఉన్న ఓ హ్యాండ్ మెయిడ్ పెయింటింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి.