Naveen Polishetty : పెద్ద యాక్సిడెంట్ అయింది.. చేతికి మూడు ఫ్రాక్చర్స్.. బాలయ్య షోలో నవీన్ పోలిశెట్టి..
యాక్సిడెంట్ తర్వాత చాన్నాళ్లకు బయటకు వచ్చి బాలయ్య షోలో పాల్గొన్నాడు నవీన్.

Naveen Polishetty : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 నుంచి ఆరో ఎపిసోడ్ నిన్న రాత్రి రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ లో శ్రీలీల, నవీన్ పోలిశెట్టి మంచి హంగామా చేసారు. గత కొన్ని నెలల క్రితం నవీన్ పోలిశెట్టి తనకు యాక్సిడెంట్ అయిందని, ఆపరేషన్ అయిందని, రెస్ట్ తీసుకుంటున్నాను అని ఓ వీడియో ద్వారా తెలిపాడు. యాక్సిడెంట్ తర్వాత చాన్నాళ్లకు బయటకు వచ్చి బాలయ్య షోలో పాల్గొన్నాడు నవీన్.
ఈ షోలో నవీన్ పోలిశెట్టి తన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చేతికి 3 ఫ్యాక్చర్స్ అయ్యాయి. వాటికి ఆపరేషన్ చేసారు. పూర్తిగా రికవర్ అవ్వడానికి కనీసం 8 నెలలు పట్టుద్ది అని డాక్టర్ చెప్పారు. కానీ ఈ బ్రేక్ లో సినిమా స్క్రిప్ట్స్ మీద కూర్చున్నాను. త్వరలో అనగనగా ఒక రాజు సినిమాతో వస్తాను. ఈ 8 నెలల సమయం మంచికే అనుకున్నాను. స్క్రిప్ట్ ఇంకా బెటర్ చేసుకోడానికి ఉపయోగపడింది అని తెలిపారు.