Nayanathara : పెళ్లయ్యాక అమ్మాయి జీవితం ఏం మారదు..

చాలా రోజుల తర్వాత నయనతార మళ్ళీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. తెలుగు, తమిళ్ లో కనెక్ట్ సినిమాని విపరీతంగా ప్రమోట్ చేస్తుంది నయన్. ఈ సినిమాకి నయన్ భర్త విగ్నేష్ శివన్ నిర్మాత. తాజాగా తెలుగు ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో.........

Nayanathara : పెళ్లయ్యాక అమ్మాయి జీవితం ఏం మారదు..

Nayanathara shares about her marriage life

Updated On : December 22, 2022 / 9:26 AM IST

Nayanathara :  నయనతార ఈ సంవత్సరం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని, సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకి తల్లయి మరోవైపు వరుసగా సినిమాలతో కూడా బిజీగా ఉంది. ఇటు భార్యగా, తల్లిగా అటు హీరోయిన్ గా లైఫ్ ని లీడ్ చేస్తుంది నయన్. నయనతార మెయిన్ లీడ్ లో నటించిన హారర్ సినిమా ‘కనెక్ట్’ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇంటర్వెల్ లేకుండా 99 నిమిషాల సినిమాగా కనెక్ట్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

చాలా రోజుల తర్వాత నయనతార మళ్ళీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. తెలుగు, తమిళ్ లో కనెక్ట్ సినిమాని విపరీతంగా ప్రమోట్ చేస్తుంది నయన్. ఈ సినిమాకి నయన్ భర్త విగ్నేష్ శివన్ నిర్మాత. తాజాగా తెలుగు ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడింది నయనతార.

Anupama Parameswaran : డైరెక్షన్ చేస్తానంటున్న మలయాళ కుట్టి..

నయనతార మాట్లాడుతూ.. పెళ్లయ్యాక అబ్బాయి ఏం మారడని, అమ్మాయి జీవితం చాలా మారుతుందని చాలా మంది అంటారు. నేను దాన్ని నమ్మను. అది మన మీదే ఆధారపడి ఉంటుంది. విగ్నేష్ నాకు 9 ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా కోసం విగ్నేష్ కొంచెం మారాడు కూడా. పెళ్లి తర్వాత నా జీవితం ఏమి మారలేదు. తన సపోర్ట్ తో పెళ్లి అయ్యాక ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నాను అని తెలిపింది.